E-Paper
Advertisement

Crime Thriller OTT : మనుషుల్ని చంపి మాస్క్ పెట్టే సైకో… హింట్ వదులుతూ హత్యలు… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి బ్రో

Crime Thriller OTT : మనుషుల్ని చంపి మాస్క్ పెట్టే సైకో… హింట్ వదులుతూ హత్యలు… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి బ్రో
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీను సీనుకో ట్విస్ట్ తో ఉత్కంఠ భరితంగా ఉంటాయి ఇలాంటి సినిమాలు. క్రైమ్ జరిగే విధానం, ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ చేజింగ్ సీన్స్ ఆద్యంతం ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ఈ జానర్ సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే బెస్ట్ రెస్పాన్స్ దక్కుతుంది. అలాంటి ఓ అద్భుతమైన క్రైమ్ థ్రిల్లరే ఈరోజు మన మూవీ సజెషన్.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అసుర్’ (Asur) సీజన్ 1 (2020). మిథాలజీ, సీరియల్ కిల్లర్ మైండ్ గేమ్స్ మిక్స్ చేసి మేకర్స్ రూపొందించిన ఈ సిరీస్ క్రియేటర్ గౌరవ్ శుక్లా, డైరెక్టర్ ఓని సేన్. అర్షద్ వార్సీ (ధనంజయ్ రాజ్‌పూత్ – CBI ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్), బరున్ సోభ్తి (నిఖిల్ నాయర్ – ఫోరెన్సిక్ టీచర్ అండ్ మిథాలజీ ఎక్స్‌పర్ట్), అనుప్రియా గోయెంకా (నైనా నాయర్), రిధి డోగ్రా (నుష్రత్ సయీద్ – CBI ఆఫీసర్), అమేయ్ వాఘ్ (శుభ్ జోషి – సీరియల్ కిల్లర్) ప్రధాన పాత్రలు పోషించారు. 8 ఎపిసోడ్స్ మార్చి 2020లో Vootలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Read Also :  మట్టిలో ఎముకల గూళ్ళు… ఈ డెడ్లీ మర్డర్ మేజ్లో అడుగు పెడితే అంతే సంగతులు

స్టోరీలోకి వెళ్తే…

సిరీస్ కథ వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హిందూ మిథాలజీలోని ఓ క్యారెక్టర్ ను తానే అనుకుని సీరియల్ కిల్లర్ బ్రూటల్ మర్డర్స్ చేస్తాడు. కిల్లర్ తనను తాను కలియుగ అసురుడిగా భావిస్తాడు. కర్మ, ధర్మం, దేవతలు vs అసురుల ఫిలాసఫీతో మర్డర్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు మర్డర్ సీన్స్‌లో మిథాలజీ సింబల్స్, రిచ్యువల్స్ ను హింట్స్ గా వదిలేస్తాడు. మరోవైపు నిఖిల్ నాయర్ (బరున్ సోభ్తి) అనే అమెరికాలో ఫోరెన్సిక్ టీచర్ గా పని చేస్తాడు. పాస్ట్ లో జరిగిన ఓ సంఘటన వల్ల ఇండియాను వదిలేసి ఉంటాడు. ఈ నేపథ్యంలోనే CBI ఒక సీరియల్ కిల్లర్ కేసు కోసం అతన్ని తిరిగి పిలుస్తుంది. అతని మెంటార్ ధనంజయ్ రాజ్‌పూత్ (అర్షద్ వార్సీ)తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కిల్లర్ శుభ్ జోషి (అమేయ్ వాఘ్) మర్డర్స్ చేస్తూనే ధనంజయ్, నిఖిల్‌ను మైండ్ గేమ్స్ ఆడిస్తాడు. క్లూస్ ఇచ్చి మరీ హత్యలు చేస్తాడు.

Advertisement

కథ రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది: ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్, పాస్ట్‌లో శుభ్ చైల్డ్‌హుడ్ ను కూడా చూపిస్తారు. నిఖిల్ వైఫ్ నైనా (అనుప్రియా గోయెంకా), CBI టీమ్ మెంబర్ నుష్రత్ (రిధి డోగ్రా) కూడా కీ రోల్స్ పోషిస్తారు ఇన్వెస్టిగేషన్ లో. చివరికి ఆ కిల్లర్ ను హీరో ఎలా పట్టుకున్నాడు ? క్లైమాక్స్ ఏంటి ? అనేది సిరీస్ లో చూడాల్సిందే. చూశాక వర్త్ వాచింగ్ మావా అంటారు పక్కా.

Read Also :  జనవరిలో ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×