E-Paper
Advertisement

అన్న తెచ్చిన తంటాలతో తమ్ముడికి తప్పని తిప్పలు… మామూలు రచ్చ కాదిది

అన్న తెచ్చిన తంటాలతో తమ్ముడికి తప్పని తిప్పలు… మామూలు రచ్చ కాదిది
Advertisement

Crime Thriller Movie OTT : ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను చూసియండి. ఇది ఒకరినొకరు నమ్మలేని ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే సైకలాజికల్ వార్. ఒకడు తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చూస్తుంటే, ఇంకొకడు తన ప్రవర్తనతో దాన్ని నాశనం చేస్తుంటాడు. ఈ కథ చాలా ఇంటెన్సివ్‌గా ఉంటుంది. న్యూయార్క్ సిటీలో ఉండే పెద్ద పెద్ద రెస్టారెంట్లు, లోపల జరిగే క్రైమ్ డీల్స్, మాఫియా సెటప్‌తో ఇది చాలా స్టైలిష్ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. ఇది ఐయండిబిలో 7.3 రేటింగ్ కూడా పొందింది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘బ్లాక్ రాబిట్’ (Black Rabbit). ఈ సిరీస్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే, హాలీవుడ్ స్టార్స్ జూడ్ లా, జేసన్ బేట్‌మాన్ కేవలం నటించడమే కాకుండా, దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా కూడా వ్యవహరించారు. అలాగే ఆస్కార్ విన్నర్ ట్రోయ్ కోట్సూర్ ఒక కీలకమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించడం ఈ సిరీస్‌కు మరింత వెయిట్ ఇచ్చింది. 2025 సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్, అన్నదమ్ముల మధ్య ఉండే సైకలాజికల్ టెన్షన్, ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

న్యూయార్క్‌లో పెద్ద హోటళ్లు నడుపుతూ, క్లాస్‌గా బతుకుతుంటాడు జేక్. ఇక లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో.. అతని తమ్ముడు విన్స్ ఎంట్రీ ఇస్తాడు. ఈ విన్స్ మామూలోడు కాదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ తెచ్చిపెట్టే రకం. వీడు రాగానే జేక్ ప్రశాంతమైన జీవితం కాస్తా రచ్చరచ్చ అయిపోతుంది. పాత గొడవలు, పీకల్లోతు కష్టాలు అన్నీ ఒక్కసారిగా తలనొప్పి తెచ్చిపెడతాయి. విన్స్ ఈ తెచ్చిన తలకాయనొప్పులు మామూలుగా ఉండవు. అతను చేసిన అప్పుల వల్ల న్యూయార్క్ మాఫియా, లోన్ షార్కులు జేక్ హోటల్ మీద పడతారు. అన్నయ్య సంపాదించిన పరువు, పైసా అన్నీ పోయేలా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, బయట రౌడీల భయం ఒకవైపు.. ఇంట్లో తిక్క తమ్ముడి గోల ఇంకోవైపుతో జేక్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారవుతుంది. ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క క్రిమినల్స్ వెంటాడుతుంటే.. ఈ అన్నదమ్ములు కలిసి ఆ ఊబిలోంచి ఎలా బయటపడ్డారు? అసలు విన్స్ కావాలనే జేక్ జీవితాన్ని నాశనం చేస్తున్నాడా ? లేక నిజంగానే ఇరుక్కుపోయాడా? అనే ఫుల్ టెన్షన్ ఇచ్చే క్లైమాక్స్ తో ఈ కథ ముగుస్తుంది.

Read Also : చచ్చిన శవాన్ని బతికించే వృద్దులు… రివర్స్ ఎక్సార్సిజం కాన్సెప్ట్‌తో వచ్చిన భయంకరమైన హారర్ థ్రిల్లర్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×