E-Paper
Advertisement

పగ తీర్చుకోవడానికి 10 ఏళ్ల నిరీక్షణ… పక్కా మాస్ రివెంజ్ స్టోరీ… ఐయండిబిలో 8.2 రేటింగ్

పగ తీర్చుకోవడానికి 10 ఏళ్ల నిరీక్షణ… పక్కా మాస్ రివెంజ్ స్టోరీ… ఐయండిబిలో 8.2 రేటింగ్
Advertisement

Crime Thriller Series OTT : రియల్ సంఘటనల ఆధారంగా ఓటీటీని షేక్ చేసింది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇది థ్రిల్లర్ జానర్ లో టాప్ 10 ట్రెండింగ్ లో నిలిచింది కూడా. ఐయండిబిలో దీనికి 8.2 రేటింగ్ ఉందంటే దీని కథ ఏమిటో తెలిసిపోతుంది. చిన్నప్పుడు స్కూల్ లో దారుణంగా వేధింపులకు గురైన ఒక అమ్మాయి పదేళ్ళ తరువాత రివేంజ్ తీర్చుకునే క్రమంలో ఈ కథ సాగుతుంది. చూశాక మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది ఈ సిరీస్ ను. మేకింగ్ స్టైల్ అంత అద్భుతంగా ఉటుంది మరి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ బ్ సిరీస్ పేరు ‘ది గ్లోరీ’ (The Glory). ఈ సిరీస్‌లో ఒక వింత విశేషం ఏంటంటే, కథలో హీరోగా నటించిన లీ దో-హ్యున్, విలన్ పాత్రలో నటించిన లిమ్ జి-యోన్ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ రియల్ లైఫ్ కపుల్‌గా కొనసాగుతున్నారు. ఇక అవార్డుల విషయానికొస్తే, 2023 బేక్‌సాంగ్ ఆర్ట్స్ అవార్డ్స్‌లో ఈ సిరీస్ ‘బెస్ట్ డ్రామా’గా నిలవడమే కాకుండా, హీరోయిన్ సాంగ్ హ్యే-క్యో ‘బెస్ట్ యాక్ట్రెస్’ అవార్డును కూడా గెలుచుకుంది.

Advertisement

ఇది విడుదలైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సిరీస్ 16 ఎపిసోడ్లతో రెండు భాగాలుగా విడుదలయ్యింది. పార్ట్-2 రిలీజ్ అయినప్పుడు వ్యూయర్ షిప్ ఎంతలా ఉందంటే, కొన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు కూడా కాసేపు మొరాయించాయి. ఈ సిరీస్ కోసం మెయిన్ హీరోయిన్ సాంగ్ హ్యే-క్యో ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 1.2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈమెకు ఇది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి. అలాగే విలన్ పాత్ర చేసిన లిమ్ జి-యోన్ కి ఈ సిరీస్ తర్వాత విపరీతమైన పాపులారిటీ వచ్చింది. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ లో కూడా ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ను కొందరు డబ్బున్న రౌడీ బ్యాచ్ పిల్లలు కలిసి నరకం చూపిస్తారు. ఒంటి మీద వాతలు పెట్టడం, కొట్టడం లాంటివి చేసి ఆమె చదువుని, జీవితాన్ని నాశనం చేస్తారు. ఆ బాధ భరించలేక చనిపోదాం అనుకున్న ఆ పిల్ల, తనని ఏడిపించిన వాళ్ళ పని పట్టాలని గట్టిగా డిసైడ్ అవుతుంది. తిండి తిన్నా తినకపోయినా కష్టపడి చదివి, పదేళ్ల తర్వాత అదే బ్యాచ్ ముందర ఒక టీచర్‌లా వచ్చి నిలబడుతుంది. హీరోయిన్ తన పగని తీర్చుకోవడానికి ఒక్కో అడుగు చాలా ప్లాన్‌గా వేస్తుంది. తనని వేధించిన మెయిన్ విలన్ కూతురు చదువుతున్న స్కూల్‌లోనే టీచర్‌గా జాయిన్ అవుతుంది.

Advertisement

ఇక ఆ రౌడీ బ్యాచ్‌లో ఉన్న ఒక్కొక్కడి గుట్టు లాగుతూ, వాళ్ళ మధ్యనే గొడవలు పెడుతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తుంది. ఈ క్రమంలో ఆమెకి ఒక డాక్టర్ కూడా హెల్ప్ చేస్తాడు, అతను కూడా తన సొంత పగ కోసం చూస్తుంటాడు. చివరికి ఆ విలన్ గ్యాంగ్ చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. కొందరు జైలుకి వెళ్తారు, కొందరు ఒకరినొకరు చంపుకుంటారు. తను పడ్డ కష్టానికి డబుల్ ట్రీట్‌మెంట్ వాళ్ళకి ఇచ్చి, అందరినీ రోడ్డు మీదకి లాగుతుంది హీరోయిన్. ఒక్క రక్తపు బొట్టు కూడా తన చేతికి అంటకుండానే, వాళ్ళ జీవితాలని ముక్కలు ముక్కలు చేసి తన పగ తీర్చుకుంటుంది.

Read Also : మాయా తాయత్తు కోసం రాక్షసులతో భీకరమైన పోరాటం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఫాంటసీ అడ్వెంచర్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×