E-Paper
Advertisement

Crime Thriller OTT : 4 ఏళ్ల పాపను పొట్టన పెట్టుకునే సైకో పిల్లలు… ఈ స్కూల్ టీచర్ ఇచ్చే పనిష్మెంట్ కు గుండె జారిపోద్ది

Crime Thriller OTT : 4 ఏళ్ల పాపను పొట్టన పెట్టుకునే సైకో పిల్లలు… ఈ స్కూల్ టీచర్ ఇచ్చే పనిష్మెంట్ కు గుండె జారిపోద్ది
Advertisement

Crime Thriller OTT : స్కూల్ అన్నాక అల్లరి పిల్లలు ఉండడం సహజమే. కానీ ఆ అల్లరి హద్దు దాటి తోటి విద్యార్థి ప్రాణం తీస్తే, దానికి ఆ పిల్లలపై రివేంజ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న స్టోరీతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? దాని స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ముబి ఓటీటీలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మూవీ పేరు ‘కన్ఫెషన్స్’ ( confessions). 2010లో విడుదలైన ఈ మూవీకి టెట్సుయా నకషిమా దర్శకత్వం వహించగా, ఈ జపాన్ సైకలాజికల్ థ్రిల్లర్ కనే మినాటో నవల ఆధారంగా తెరకెక్కింది. డైరెక్టర్ టెట్సుయా నకషిమా ఇదివరకు ‘కామికాజే గర్ల్స్’, ‘మెమరీస్ ఆఫ్ మాట్సుకో’ అనే సూపర్ హిట్ సినిమాలు తీశారు. తకాకో మాట్సు, మసాకి ఒకడా, యుకితో నిషి, కై ఇనోవాకి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 46 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2010 జూన్ 5న జపాన్‌లో విడుదల అయింది. జపాన్ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ లాంటి అవార్డ్స్ గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు MUBI ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రివెంజ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకి ఈ మూవీ ఒక మాస్టర్‌పీస్. అస్సలు మిస్ అవ్వొద్దు.

Advertisement

Read Also :  ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో దూరే పోలీస్ – నిందితుడు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

మిడిల్ స్కూల్ టీచర్ యూకో మోరిగుచి (తకాకో మాట్సు) చుట్టూనే ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆమెకు 4 ఏళ్ల కూతురు ఉంటుంది. ఆ పాప స్విమ్మింగ్ పూల్‌ లో మునిగిపోయి ఆ తల్లికి తీరని మనో వేదనను మిగులుస్తుంది. కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసులేమో యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేస్తారు. కానీ ఈ దారుణమైన ఘటనకి యూకో తన క్లాస్‌ లోని ఇద్దరు స్టూడెంట్స్ కారణం అని తెలుసుకుంటుంది. అయితే వాళ్ళే నిందితులు అని తెలిసినా… చిన్న పిల్లలు కావడంతో అక్కడి జువెనైల్ లా వల్ల పిల్లలకి శిక్ష పడదు.

Advertisement

సెమెస్టర్ లాస్ట్ డే క్లాస్‌ లో ఆ పిల్లలపై యూకో తన రివెంజ్ ను ప్లాన్ చేస్తుంది. మరి టీచర్ తన కూతురి చావుకు కారణం అయిన పిల్లలపై ఎలా రివేంజ్ తీర్చుకుంది ? అసలు యూకో రివేంజ్ ప్లాన్ ఏంటి ? మైండ్ బెండయ్యే క్లైమాక్స్ ఏంటి ? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. సినిమాలో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్త.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×