E-Paper
Advertisement

Superhero Horror OTT : ముఖం లేని రాక్షసుడితో సూపర్ హీరోల ఫైటింగ్… యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపే హర్రర్ మూవీ

Superhero Horror OTT : ముఖం లేని రాక్షసుడితో సూపర్ హీరోల ఫైటింగ్… యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపే హర్రర్ మూవీ
Advertisement

Superhero Horror OTT : సూపర్ మ్యాన్ సినిమాలు అనగానే మార్వెల్ మూవీస్ గుర్తొస్తాయి. ఈ సంస్థలో వచ్చిన ఒక్కో మూవీ ఒక్కో ఆణిముత్యం అని చెప్పవచ్చు. అందుకే వాటికి ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక మార్వెల్ సైతం తమ అభిమానుల కోసం ఫ్రాంచైజీల రూపంలో వరుసగా సూపర్ హీరోల సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన అలాంటి ఓ క్రేజీ సూపర్ హీరో మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ విశేషాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఎక్స్ – మెన్ యూనివర్స్‌ లో ఒక యూనిక్ ఎంట్రీగా వచ్చిన మూవీ ‘ది న్యూ మ్యూటెంట్స్’ (The New Mutants). 2020లో తెరపైకి వచ్చిన ఈ మవవీకి జోష్ బూన్ దర్శకత్వం వహించారు. ఈ సూపర్‌ హీరో హారర్ థ్రిల్లర్ మూవీని క్రిస్ క్లెర్‌మాంట్, బాబ్ మెక్‌లీడ్ కామిక్స్ ఆధారంగా రూపొందించారు. సైమన్ కిన్‌బర్గ్, లారెన్ షులర్ డోనర్ నిర్మించిన ఈ మూవీలో బ్లూ హంట్, మైసీ విలియమ్స్, అన్యా టేలర్-జాయ్, చార్లీ హీటన్, హెన్రీ జాగా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 34 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా 2020 ఆగస్ట్ 28న థియేటర్లలో సందడి చేసింది. నిజానికి ముందుగానే విడుదల కావలసి ఉన్నా, పాండమిక్ వల్ల డిలే అయింది. X-మెన్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ, ఆ ఫిల్మ్స్‌తో కనెక్షన్ లేకపోవడం ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికీ ఈ మూవీ ఊహించని ట్విస్టులు, భయపెట్టే హర్రర్ సీన్స్ తో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఈ సినిమా కోసం డైరెక్టర్ భార్య నగలు, ఇల్లు తాకట్టు… కట్ చేస్తే కాసుల వర్షం

స్టోరీలోకి వెళ్తే…

ఈ సినిమాలో కథ మొత్తం ఐదుగురు యంగ్ మ్యూటెంట్స్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ల పవర్స్ ఏంటో వాళ్ళకి ఫస్ట్ టైమ్ తెలుస్తుంది. కానీ అంతలోనే ఒక సీక్రెట్ ఫెసిలిటీలో వీళ్ళని బంధిస్తారు. డాక్టర్ సిసిలియా రేయ్స్ (ఆలిస్ బ్రాగా) వాళ్లకి ట్రీట్మెంట్ అందిస్తుంది. ఫస్ట్ టైమ్ పవర్స్ వచ్చాయి కాబట్టి, వాటిని హ్యాండిల్ చేయడం కష్టం అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. పైగా ఆ పవర్స్ ను ఎలా కంట్రోల్ చేయాలో తాను నేర్పిస్తానని చెబుతుంది. ఈ నేపథ్యంలోనే డానీ మూన్‌స్టార్ (బ్లూ హంట్) అక్కడికి అడుగు పెడుతుంది.

Advertisement

అప్పటికే ఫెసిలిటీలో ఉన్న రేన్, ఇల్యానా, సామ్, రాబర్టోలను కలుస్తుంది. అయితే ఆ పిల్లలకు ఉన్న పవర్స్ వల్ల సొసైటీకి డేంజర్ అని కట్టుకథలు చెబుతారు. కానీ ఫెసిలిటీలో ఉన్నప్పుడు సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళకి వింత సంఘటనలు ఎదురవుతాయి. వాళ్ళకు వచ్చిన భ్రమలు, భయాలు ఒక్కొక్కటిగా నిజం కూడా అవుతాయి. గతంలో ఆ పిల్లలను భయపెట్టిన సంఘటనలు మళ్లీ కళ్లముందుకు వస్తాయి. వాటి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు ? అసలు ఆ డాక్టర్ ఎవరు ? ఎందుకు వీళ్ళని బంధించింది ? చివరకి ఏమైంది ? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×