E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో విబేధాలు – చేపట్టిన పనుల్లో ఆటంకాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో విబేధాలు – చేపట్టిన పనుల్లో ఆటంకాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

వృషభం

Advertisement

వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.  స్థిరాస్థి వృద్ధి చెందుతుంది ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. 

మిథునం

వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

కర్కాటకం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు.  దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

సింహం

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం

ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. 

ధనుస్సు

ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

మకరం

వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు.  సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.  

కుంభం

 ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

మీనం

కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×