E-Paper
Advertisement

Crime Thriller OTT : నగలు మిస్సింగ్… భర్తను టార్చర్ చేసే పోలీసులు… మెంటలెక్కించే థ్రిల్లర్ స్టోరీ

Crime Thriller OTT : నగలు మిస్సింగ్… భర్తను టార్చర్ చేసే పోలీసులు… మెంటలెక్కించే థ్రిల్లర్ స్టోరీ
Advertisement

Crime Thriller OTT : ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ని ఆలోచనలో పడేసింది. ఈ సినిమాలో పోలీసు వ్యవస్థలో ఉండే లోపాలు, అధికార దుర్వినియోగం ఒక సామాన్యుడిని ఎలా నాశనం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. అందరు పోలీసులు ఇలా ఉంటారని కాదు కానీ, కొంత మంది వల్ల పోలీస్ అంటే చాలా మందికి ఇదే అభిప్రాయం ఉన్న మాట అయితే వాస్తవం. పోలీస్ మీ స్నేహితుడు అనే నినాదం నిజ జీవితంలో ఎంతవరకు అమలవుతోంది? చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలను ఈ సినిమా చూస్తే కలుగుతాయి. ఈ సినిమాపేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ తమిళ భాషా క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కవల్తురై ఉంగల్ నన్బన్’ (Kavalthurai ungal nanban). ఇది రంజిత్ మణికందన్ దర్శకత్వంలో రూపొందింది. బిఆర్ టాకీస్ కార్పొరేషన్, వైట్ మూన్ టాకీస్ పతాకాలపై రాజపొండియన్, భాస్కరన్ బి, సురేష్ రవి నిర్మించారు. ఈ చిత్రంలో సురేష్ రవి, రవీనా రవి నటించారు, ఇందులో RJ మున్నా, సూపర్‌గుడ్ సుబ్రమణి, శరత్ రవి సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వెట్రిమారన్‌ సమర్పించారు. ఈ సినిమా 2020 నవంబర్ 27న విడుదలైంది. ప్రస్తుతం Zee5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ

స్టోరీ ఏమిటంటే

ప్రభు అనే ఒక మధ్యతరగతి యువకుడు. తన భార్య ఇందుతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఒక రోజు రాత్రి ప్రభు తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, దారిలో ఒక దొంగతనం జరగడం చూస్తాడు. ఆ దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ కన్నబిరాన్‌తో ప్రభుకు చిన్న మాట పట్టింపు వస్తుంది. ప్రభు తన హక్కుల గురించి మాట్లాడటం, ప్రశ్నించడం ఆ పోలీస్ అధికారికి అహం దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. ఇక కథ మరోలా టర్న్ తీసుకుంటుంది.

Advertisement

ఆ చిన్న ఇగో సమస్య కాస్తా పెద్దదవుతుంది. కన్నబిరాన్ తన అధికారాన్ని ఉపయోగించి ప్రభును అక్రమంగా స్టేషన్‌లో బంధిస్తాడు. అక్కడ ప్రభును తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తారు. తన తప్పు లేకపోయినా, పోలీసుల వేధింపుల వల్ల ప్రభు జీవితం తలకిందులవుతుంది. అతని భాటియా కూడా చాలా వేదనకి గురవుతుంది. ప్రభు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి, ఆ అన్యాయంపై ఎలా పోరాడాడు అనేదే మిగతా కథ. ఈ సినిమా ముగింపు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×