E-Paper
Advertisement

Crime Thriller OTT : తెలివైన అమ్మాయిల్నే కిడ్నాప్ చేసే సైకో… ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఎంట్రీతో ఊహించని ట్విస్టులు

Crime Thriller OTT : తెలివైన అమ్మాయిల్నే కిడ్నాప్ చేసే సైకో… ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఎంట్రీతో ఊహించని ట్విస్టులు
Advertisement

Crime Thriller OTT : ఎందుకో తెలీదు గానీ చాలా వరకు సైకో కిల్లర్ సినిమాలలో అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ ఉంటారు కిల్లర్స్. కాకపోతే అందులోనూ కాస్త కొత్తదనం ట్రై చేస్తారు మేకర్స్. ఓ సైకో అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తే, మరో సైకో అర్దరాత్రి కన్పించే అమ్మాయిలను చంపుతాడు. తెల్లగా ఉన్న అమ్మాయిలను, ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయిలను… ఇలా చాలా రకాల కథలే వచ్చాయి. కానీ ఈరోజు మనం చెప్పుకునే మూవీలో మాత్రం సైకో తెలివైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తాడు.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ 1997లో విడుదలైన “కిస్ ది గర్ల్స్” (kiss the girls). జేమ్స్ ప్యాటర్సన్ రాసిన అదే పేరుగల బెస్ట్‌సెల్లర్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. డైరెక్టర్ గ్యారీ ఫ్లెడర్ ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ కు రూపొందించారు. మార్గన్ ఫ్రీమాన్, ఆష్లీ జడ్, కారీ ఎల్వెస్, టోనీ గోల్డ్‌విన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 115 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ మూవికీ IMDbలో 6.6 రేటింగ్ ఉంది. 27 మిలియన్ డాలర్లతో ఈ మూవీని నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద 60 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది మూవీ. ఈ మూవీ అలెక్స్ క్రాస్ సిరీస్‌లో ఫస్ట్ మూవీ. తర్వాత కొనసాగింపుగా Along Came a Spider అనే మూవీ కూడా వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఇండియాలో నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : సైలెంట్ గా ఓటీటీలోకి ఆది పినిశెట్టి రివేంజ్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

స్టోరీలోకి వెళ్తే…

ఫోరెన్సిక్ సైకాలజిస్ట్, డిటెక్టివ్ డాక్టర్ అలెక్స్ క్రాస్ (మార్గన్ ఫ్రీమాన్)కు వచ్చే షాకింగ్ న్యూస్ తో మూవీ షురూ అవుతుంది. నార్త్ కరోలినాలో చదువుతున్న అతని మేనకోడలు నవోమి (గీనా రవేరా) కనిపించట్లేదు అన్నది ఆ వార్త సారాంశం. వాషింగ్టన్ డీ.సీ.లో ఉండే అలెక్స్ వెంటనే తన మేనకోడలి ఆచూకీని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్‌ లో చేరతాడు. నవోమి ఒక సీరియల్ కిడ్నాపర్ బాధితురాలు కావచ్చు అనే మరో షాకింగ్ విషయం చెప్తారు లోకల్ పోలీసులు. ఈ కిల్లర్ “కాసనోవా” అనే సిగ్నేచర్ తో కిడ్నాప్ లు చేస్తాడు. అయితే అతను సాదా సీదా అమ్మాయిలను మాత్రం టార్గెట్ చేయడు. అందంగా ఉండే తెలివైన, టాలెంటెడ్ అమ్మాయిలనే కిడ్నాప్ చేసి, తన “కలెక్షన్”లో వాళ్ళను పార్ట్ చేస్తాడు. ఇలా కిడ్నాప్ చేసిన అమ్మాయిలను సీక్రెట్ భూగర్భ జైలులో బంధిస్తాడు.

Advertisement

ఆ అమ్మాయిలతో లవర్ లా బిహేవ్ చేస్తాడు. కానీ తాను పెట్టిన రూల్స్ ను వాళ్ళు బ్రేక్ చేస్తే మాత్రం చావే శిక్ష. అలెక్స్ లోకల్ డిటెక్టివ్ నిక్ రస్కిన్ (కారీ ఎల్వెస్)తో కలిసి ఈ కిల్లర్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. అప్పుడే ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. డాక్టర్ కేట్ మెక్‌టియర్నన్ (ఆష్లీ జడ్) ఆ సైకో నుంచి ఎస్కేప్ అవుతుంది. నిజానికి వాడి నుంచి తప్పించుకున్న ఏకైక బాధితురాలు ఆవిడే. అసలు ఆ అమ్మాయి ఎలా ఎస్కేప్ అయ్యింది ? కిల్లర్ ను పట్టుకోవడంలో పోలీసులకు ఎలా హెల్ప్ చేసింది ? అన్నది మూవీలో చూడాల్సిందే.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×