E-Paper
Advertisement

Drive OTT : సైలెంట్ గా ఓటీటీలోకి ఆది పినిశెట్టి రివేంజ్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Drive OTT : సైలెంట్ గా ఓటీటీలోకి ఆది పినిశెట్టి రివేంజ్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Drive OTT :  కొన్ని సినిమాలు అసలు ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయి, ఎప్పుడు పోయాయి అన్నది తెలియకుండానే వచ్చిపోతాయి. అలాంటి ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ఆది పినిశెట్టి హీరో కావడం విశేషం. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అఖండ 2’తో పాటు ఆది పినిశెట్టి మరో సినిమా కూడా అదే రోజు విడుదలైంది. కానీ అది పెద్దగా గుర్తింపు పొందలేదు. ‘డ్రైవ్’ (Drive movie) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా హీరో, నిర్మాతల నుండి కనీస ప్రమోషన్లు లేకపోవడంతో కనీసం బజ్ క్రియేట్ చేయలేకపోయింది. భవ్య క్రియేషన్స్ పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ రివెంజ్ డ్రామా నిశ్శబ్దంగా థియేటర్లలోకి వచ్చి, ఆడియన్స్ దృష్టిలో పడకుండానే సైడ్ అయిపోయింది. డిసెంబర్ 12 న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ‘అఖండ 2’లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు నటుడు ఆది పినిశెట్టి.

Advertisement

అలా విడుదలై నెలకూడా కాకుండానే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కనీసం డిజిటల్ స్ట్రీమింగ్ తో అయినా ఆడియన్స్ దృష్టిలో పడాలనే ఆశతో ‘డ్రైవ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోకి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం పాన్-ఇండియన్ ఓటీటీ మూవీగా విడుదలైంది. మూవీ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్‌లు కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే థియేటర్లలో ఉన్నప్పుడు దీనిని చూసిన వారు ఈ చిత్రం నిస్తేజంగా, పెద్దగా ఆకర్షణీయంగా లేదని భావించారు.

Read Also :  పబ్ లో మోడల్ హత్య… ఇంత ఓపెన్ గా మర్డర్ ఏంటి భయ్యా… ఈ క్రైమ్ డ్రామా క్లైమాక్స్ కేక

స్టోరీ ఇదే

Advertisement

సైబ‌ర్ క్రైమ్స్‌, హ్యాకింగ్స్ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంది. మీడియా టైకూన్ జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి) ఒక జాతీయవాద సంస్థతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని, తన కుటుంబంతో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఒక హ్యాకర్ ఒప్పందాన్ని బయటపెట్టి జయదేవ్ జీవితాన్ని చిందరవందర చేసినప్పుడు పరిస్థితులు ఆందోళనకరంగా మారతాయి. హ్యాకర్ జయదేవ్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటాడు. ఈ హ్యాకర్ ఎవరు ? అతను జయదేవ్ వెంట ఎందుకు ఉన్నాడు ? ఈ వివాదం ఎలా ముగుస్తుంది ? అనేది ఈ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే.

జెనుస్ మొహమ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనిష్ యోహాన్ కురువిల్లా కీలక పాత్రలు పోషించారు. ‘డ్రైవ్’ కు సీక్వెల్ ను ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా ? లేదా నిశ్శబ్దంగా నిలిపివేస్తారా ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×