Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాను టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. తెలుగుతోపాటు మిగతా అన్ని భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. ఇటీవలే తెలుగు, హిందీలో ఈ షోకు ముగింపు కార్డు పడింది. కానీ తమిళ బిగ్ బాస్ దాదాపు సీజన్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ బిగ్ బాస్ లో గొడవలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అలాంటిది మరొక గొడవ జరిగినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో నిజంగానే జరిగిందా? లేదా టిఆర్పిని పెంచుకునేందుకు బిగ్ బాస్ ఇలా చేశారా..? అసలు నిజాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
తమిళంలో ఈ షో ప్రసారం అవుతుంది.. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో లాగే అక్కడ కూడా తొమ్మిదవ సీజన్ ప్రసారం అవుతుంది.. ఈ షోలో రోజుకు ఒక వార్త బయటికి వస్తుంది… గత కొన్ని రోజుల క్రితం కంటెస్టెంట్లు కొట్టుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మరోసారి కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టేశారు.. టాస్క్ లో భాగంగా ఇద్దరు మేల్ కంటెంట్లు ఫిమేల్ కంటెంట్ పై రెచ్చిపోయారు.. ఓ మహిళా కంటెస్టెంట్‌తో మరో ఇద్దరు కంటెస్టెంట్లు వ్యవహరించి తీరు అత్యంత పాశవికంగా కనిపించింది.. తమిళ షోలోని హౌస్‌లో కారు టాస్క్ జరిగింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లను కారులోకి ఎక్కించి ఎవరైతే చివరి వరకు కారులో ఉంటారో వారిని విజేతగా ప్రకటిస్తామని చెప్పడంతో కంటెస్టెంట్లు నువ్వు అనేనా అని పోటీకి దిగారు. కమ్రుద్దీన్, పార్వతిలో ఏ మాత్రం పశ్చాత్తపం కనిపించకపోవడం గమనార్హం.. సండ్రాపై అత్యంత పైశాచికంగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Also Read :ఆదివారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…
తమిళ బిగ్ బాస్ పై గతంలో అనేక సార్లు గొడవలు జరిగాయి. ఇలా జరగడం కొత్తేమి కాదు. ఈ సీజన్ మొదలైనప్పటినుంచి ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ అభ్యంతరకరంగా ఉంది అంటూ పలుకులు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.. వారి ప్రవర్తన వల్ల కంటెస్టెంట్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారిపై కఠిన చర్య తీసుకోవాలని వేల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు.. మరి దీనిపై తమిళ బిగ్ బాస్ యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి… రియాలిటీ షోలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ కఠినంగా వ్యవహరించాలి. ఎవరు ఎలాంటివారు తెలుసుకొని హౌస్ లోకి పంపించడం వల్ల ఎటువంటి గొడవలు జరగవు అని కామెంట్లతో బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి తమిళ బిగ్ బాస్ టాస్క్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
#Day90 #Promo3 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/ltYDSDdy98
— Vijay Television (@vijaytelevision) January 3, 2026