E-Paper
Advertisement

Crime Thriller OTT : జాతరలో తప్పిపోయే పదేళ్ళ ఆడపిల్లలు… IMDbలో 7.8 రేటింగ్‌… క్షణక్షణం ఉత్కంఠ

Crime Thriller OTT : జాతరలో తప్పిపోయే పదేళ్ళ ఆడపిల్లలు… IMDbలో 7.8 రేటింగ్‌… క్షణక్షణం ఉత్కంఠ
Advertisement

Crime Thriller OTT : ఓటీటీ ప్రియులు కొత్త వెబ్ సిరీస్ ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొత్తగా వస్తే సరిపోదు ఆద్యంతం ఆసక్తికరంగా, కొత్తగా ఉండాలి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. 7 ఎపిసోడ్‌ల ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విడుదలైన తర్వాత సంచలనం సృష్టించింది. IMDbలో సిరీస్ రేటింగ్ ఎంత? సిరీస్ పేరేంటి? కథ ఏంటి? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

డిసెంబర్ 5న విడుదలైన వెబ్ సిరీస్ ‘కుట్రమ్ పురింధవన్ – ది గిల్టీ వన్’ (Kuttram Purindhavan : The Guilty One Series). సోనీ లివ్‌ (Sonyliv)లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు అస్సలు మిస్ అవ్వొద్దు. తమిళంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో పశుపతి, విధార్థ్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సిరీస్ కి సెల్వమణి దర్శకత్వం వహించగా, 7 ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి వచ్చింది ఈ సిరీస్. ఓటీటీలో సంచలనం క్రియేట్ చేసిన ఈ సిరీస్ కు ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే 7 ఎపిసోడ్లు పూర్తి చేసేదాకా వదలరు. నిజానికి మొదటి మూడు ఎపిసోడ్‌లను చూస్తేనే గానీ కథ అర్థం కాదు. ఇక మిగిలిన నాలుగు ఎపిసోడ్‌లు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి పక్కా.

Advertisement

Read Also :  ఓటీటీలోకి ధర్మేంద్ర చివరి చిత్రం… ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే ?

స్టోరీలోకి వెళ్తే…

ఓ ఊర్లో భాస్కర్ (పశుపతి) అనే ఫార్మసిస్ట్ తన భార్య ‘ఆనంది'(లిజీ ఆంటోనీ)తో కలిసి అద్దె ఇంట్లో నివశిస్తాడు. కూతురు ‘సెల్వి’ చనిపోవడంతో, అల్లుడు వదిలేసిన మనవడి రాహుల్ ని ఈ దంపతులే చూసుకుంటారు. రాహుల్ మెదడుకి సంబంధించిన వ్యాధి ఉంటుంది. దీంతో అప్పుడప్పుడూ కళ్ళు తిరిగి పడిపోతాడు. త్వరలోనే రిటైర్ కాబోతున్న భాస్కర్ ఆ డబ్బుతోనే మనవడికి సర్జరీ చేయించాలనే ఆలోచనలో ఉంటాడు. భాస్కర్ పక్కింట్లోనే ఎస్తేర్ తన తాగుబోతు భర్త, కూతురు మెర్సీతో కలిసి నివశిస్తుంది. ఇరుగు పొరుగు అయినప్పటికీ ఒక కుటుంబంలా ఉంటారు వీళ్ళంతా. ఎస్తేర్ ను రాహుల్ అమ్మా అని పిలిస్తే, భాస్కర్ దంపతులను ఎస్తేర్ అమ్మా నాన్నా అని పిలుస్తుంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఊర్లో జాతర జరుగుతుంది. అదే టైమ్ లో ఎస్తేర్ భర్త ఇంటి ముందు శవమై కన్పిస్తాడు. కూతురు మెర్సీ మిస్ అవుతుంది. భాస్కర్ తాను జాతర నుంచి ఇంటికి వెళ్తూ మెర్సీని చూశానని స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో కానిస్టేబుల్ గౌతమ కీలక పాత్రను పోషిస్తాడు. అసలు మెర్సీ ఏమైంది ? ట్యూషన్ టీచర్ ఫోన్లో మెర్సీ ఫోటోలు ఎందుకు ఉన్నాయి ? చర్చి ఫాదర్ కి ఈ కేసుతో సంబంధం ఏంటి ? నిజం ఏంటో తెలిసినా భాస్కర్ దంపతులు ఎందుకు దాచి పెట్టారు ? అసలు మెర్సీ ఏమైంది ? మనవరాలు లాంటి అమ్మాయిని భాస్కర్ ఏం చేశాడు ? ఎస్తేర్ గతంతో మెర్సీ మిస్సింగ్ కేసుకు ఉన్న లింకును కానిస్టేబుల్ ఎలా బయట పెట్టాడు ? అన్నది కథ.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×