E-Paper
Advertisement

Anjeer Health Benefits: శీతాకాలంలో ఇమ్యూనిటీకి అంజీర్ వరం.. డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో జరిగే మార్పులివే!

Anjeer Health Benefits: శీతాకాలంలో ఇమ్యూనిటీకి అంజీర్ వరం.. డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో జరిగే మార్పులివే!
Advertisement

Anjeer Health Benefits: రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రస్తుతం మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో రకరకాల ఇన్ఫెక్షన్లు మనపై దాడి చేస్తుంటాయి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎలాంటి మందులు వాడకుండానే.. సహజసిద్ధంగా దొరికే, అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న అంజీర్‌ పండ్లను మన డైట్‌లో చేర్చుకుంటే చాలు. వీటిని రోజూ ఒకటి లేదా రెండు తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది:

ప్రస్తుత చలికాలంలో మన శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ నేపథ్యంలో మన రోజువారీ ఆహారంలో సరైన పండ్లు చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా అంజీర్ పండు శీతాకాలానికి చాలా అనుకూలమైనది. ఈ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ చేసే సామర్థ్యం ఈ అంజీర్ పండ్లకు ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.

Advertisement

Also Read: అతిగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ మింగుతున్నారా? అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే!

బరువు తగ్గడంలో సహాయకారి:

ముఖ్యంగా బరువు నియంత్రణ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అలాగే అంజీర్ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో.. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చలికాలంలో తీసుకుంటే.. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. దీంతో గుండెపై భారం పడకుండా ఉంటుంది. అలాగూ అంజీర్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా రావడానికి ఇవి సహకరిస్తాయి.

చర్మంపై తేమను నిలుపుతుంది:

Advertisement

అంజీర్ చర్మ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారడం చూసుకుంటుందీ అంజీర్. దీంతోపాటు చర్మానికి సహజ కాంతిని అందించడంలో ఈ ఫ్రూట్ మేలు చేస్తుంది. అలాగే ఎముకలను దృఢంగా మార్చడంలో అంజీర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి.. ఇవి ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తాయి.

Also Read: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ వీకెండ్ టిప్స్‌తో స్ట్రెస్‌ను దూరం చేసుకోండి!

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×