E-Paper
Advertisement

Crime Thriller OTT : ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller OTT : ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు చూస్తున్నంత సేపూ ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. అందుకే ఈ జానర్ సినిమాలు అంటే ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఓటీటీలలో మీరు గనుక ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం వెతుకున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఆ మూవీ ఏంటి? దాని కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్

ఎం. ధినకరన్ డైరెక్ట్ చేసిన తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ Regai (రేగై – ఫింగర్‌ప్రింట్). ప్రముఖ క్రైమ్ నవలా రచయిత రాజేష్ కుమార్ నవల ఆధారంగా దీనిని తీసారు. బాల హాసన్, పవిత్రా జనని, వినోధిని వైద్యనాథన్, అంజలి రావు, పూబాలం ప్రగతీష్, ఇంద్రజిత్ మొదలైన వారు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 6 ఎపిసోడ్‌ల సిరీస్ 2025 నవంబర్ 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ లో ఎపిసోడ్‌లు షార్ట్ గానే ఉంటాయి. అంటే ఒక్కోటి 18-29 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సిరీస్ కు IMDb 6.6 రేటింగ్ ఉంది.

Advertisement

Read Also :  హాలీవుడ్ నుంచి మరాఠీ వరకు… జియో హాట్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు, సిరీసులు

స్టోరీలోకి వెళ్తే…

సిరీస్ స్టోరీ చెన్నైలో సాగుతుంది. సబ్-ఇన్‌స్పెక్టర్ వేత్రి (బాల హాసన్) పోలీస్ ఆఫీసర్. అతని స్నేహితుడు అముధన్ రోడ్ యాక్సిడెంట్‌ లో చనిపోతాడు. పోలీసు డిపార్ట్‌మెంట్ అతని మరణాన్ని సాధారణ యాక్సిడెంట్‌ గా క్లోజ్ చేయమని ఒత్తిడి చేస్తుంది. దీంతో వేత్రికి సందేహం వచ్చి, అముధన్ శవాన్ని పరిశీలిస్తాడు. ఆయన చేతులపై వెరైటీ మార్క్స్, ఇంజెక్షన్ ట్రేసెస్ ను కనిపెడతాడు. ఈ మిస్టీరియస్ మరణానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని వేత్రి దర్యాప్తు మొదలు పెట్టగా, అముధన్ మరణానికి ముందు ఒక మెడికల్ రీసెర్చ్ ల్యాబ్‌ తో కనెక్ట్ అయినట్టు తెలుసుకుంటాడు. ఆ ల్యాబ్ ఇల్లీగల్ క్లినికల్ ట్రయల్స్ చేస్తూ, పేద యువకులను సబ్జెక్ట్స్‌గా ఉపయోగిస్తుందనే షాకింగ్ విషయం ఇన్వెస్టిగేషన్ లో బయట పడుతుంది.

Advertisement

మరోవైపు కానిస్టేబుల్ సంధ్య (పవిత్రా జనని) వేత్రికి సపోర్ట్ చేస్తుంది. ఇద్దరూ ఒక ఐస్ క్రీమ్ కార్ట్‌ లో రక్తం కారుతున్న దృశ్యం చూసి షాక్ అవుతారు. అందులో ముక్కలు ముక్కలుగా కట్ చేసిన మనుషుల చేతులు దొరుకుతాయి. ఆ చేతుల ఫింగర్‌ ప్రింట్స్ ను ల్యాబ్ కు పంపితే నలుగురు చనిపోయిన వేర్వేరు యువకులతో మ్యాచ్ అవుతాయి. వీళ్ళు అందరూ కూడా రోడ్ యాక్సిడెంట్‌ లో చనిపోయిన వారే. మరి ఆ నలుగురు యువకులు ఎవరు ? ఇంతకీ ఎలా చనిపోయారు? వాళ్ళ చావుకు, అముదన్ చావుకు సంబంధం ఏంటి? అముదన్ చనిపోయాక అతని గర్ల్ ఫ్రెండ్ ఏమైంది? ఫార్మా కంపెనీ బాగోతాన్ని హీరో ఎలా బయట పెడతాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×