E-Paper
Advertisement

రిలేషన్షిప్ మర్డర్ తో దిమ్మతిరిగే లీగల్ క్రైమ్ స్టోరీ… క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు బాస్

రిలేషన్షిప్ మర్డర్ తో దిమ్మతిరిగే లీగల్ క్రైమ్ స్టోరీ… క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు బాస్
Advertisement

Crime Thriller OTT : పక్కా మైండ్ గేమ్ తో వచ్చిన ‘ప్రిస్యూమ్డ్ ఇన్నోసెంట్’ సిరీస్ ఓటీటీలో బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇది ఊరికే కొట్టుకోవడం, తిట్టుకోవడం కాకుండా.. బుర్రకి పని పెట్టే కథ. ఒక మర్డర్ మిస్టరీని పట్టుకుని, కోర్టులో లాయర్లు ఒకరినొకరు ఎలా ఆడుకుంటారు, ఒక తప్పు వల్ల ఒకడి సంసారం నడిరోడ్డు మీదకు ఎలా వస్తుంది అనేదాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు ఇందులో. ప్రతి ఎపిసోడ్ అయిపోయేటప్పుడు, మనకి పిచ్చెక్కించేలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ సిరీస్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను బాగా థ్రిల్ చేసింది కూడా. అందుకే దీనికి సీజన్ 2 కోసం మేకర్స్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ లీగల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ప్రిస్యూమ్డ్ ఇన్నోసెంట్’ (Presumed Innocent). ఈ సిరీస్‌ను హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ J.J. అబ్రమ్స్ (స్టార్ వార్స్ ఫేమ్) డేవిడ్ E. కెల్లీ నిర్మించారు. 2024లో వచ్చిన ఈ సిరీస్ లో జేక్ జిలెన్‌హాల్, రూత్ నెగ్గా, బిల్ క్యాంప్, పీటర్ సర్స్‌గార్డ్ లీడ్ రోల్స్ లో నటించారు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ Apple TVలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ భారీ హిట్ అవ్వడంతో రెండో సీజన్‌ను కూడా ప్రకటించారు. మొదటి సీజన్ హీరో జేక్ జిలెన్‌హాల్ రెండో సీజన్‌లో కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటారు. కొత్త సీజన్‌లో రాచెల్ బ్రోస్నహన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఆమెతో పాటు మాథ్యూ రైస్, జుడిత్ లైట్ వంటి ప్రముఖ నటులు కూడా చేరుతున్నారు. రెండో సీజన్ షూటింగ్ డిసెంబర్ 2025 నుండి లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమైంది. ఇది 2026 మధ్యలో లేదా చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక ఊరిలో రస్టీ అనే పెద్ద ప్రాసిక్యూటర్ ఉంటాడు. అతనికి పెళ్ళాం, పిల్లలు ఉన్నా కూడా ఆఫీసులో పని చేసే మరో లాయర్ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అంతా సజావుగానే సాగుతోంది అనుకున్న టైంలో, సడన్‌గా ఆ అమ్మాయి తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురవుతుంది. సీన్ కట్ చేస్తే, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన హీరో రస్టీకే వస్తుంది. కేసు లోతుగా వెళ్లేకొద్దీ, హీరోకి ఆ అమ్మాయితో ఎఫైర్ ఉందన్న విషయం బయటపడుతుంది. అంతేకాకుండా, హత్య జరిగిన చోట హీరోకి సంబంధించిన ఆధారాలు దొరకడంతో పోలీసులు రస్టీనే నిందితుడిగా అరెస్ట్ చేస్తారు.

నిన్నటి దాకా నిందితులను కోర్టులో నిలబెట్టిన హీరో, ఇవాళ తనే బోనులో నిలబడాల్సి వస్తుంది. ఒక పక్క కోర్టులో కేసు, మరోపక్క తన తప్పు తెలుసుకున్న పెళ్ళాం నుంచి వచ్చే టెన్షన్.. ఇలా హీరో లైఫ్ మొత్తం గందరగోళం అయిపోతుంది. కోర్టులో వాదోపవాదాలు జరిగి, హీరో నిర్దోషి అని తీర్పు వస్తుంది. కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఉంటుంది. ఆ అమ్మాయిని చంపింది హీరో కాదు, బయట ఎవరో కాదు.. ఆ హత్య వెనుక ఇంట్లో మనిషే ఉన్నాడని హీరోకి తెలుస్తుంది. చివరికి ఆ హత్య ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పిచ్చెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్… గురువును మించిన శిష్యురాలు… ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×