E-Paper
Advertisement

పిచ్చెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్… గురువును మించిన శిష్యురాలు… ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

పిచ్చెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్… గురువును మించిన శిష్యురాలు… ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠభరితమే
Advertisement

Thriller Series OTT : ఒక కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ఐయండిబి 7.3 రేటింగ్ తో ఓటీటీలో దూసుకెళ్తోంది. గత ఏడాది వచ్చిన ఈ సిరీస్ ప్రతీ సీన్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులో హీరో, విలన్ ఇద్దరూ తెలివైన డాక్టర్లే. ఒకరిని ఒకరు దెబ్బకొట్టుకోవడానికి కత్తుల కంటే ఎక్కువగా తెలివితేటలను వాడుతుంటారు. మీరు సస్పెన్స్ థ్రిల్లర్స్, మెడికల్ డ్రామాలు ఇష్టపడే వారైతే, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

2025 లో వచ్చిన ఈ కొరియన్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘హైపర్ నైఫ్’. ఈ సిరీస్‌లో పార్క్ యున్-బిన్, సుల్ క్యుంగ్-గు లాంటి హేమాహేమీలు నటించారు. ముఖ్యంగా పార్క్ యున్-బిన్ తన పాత సాఫ్ట్ ఇమేజ్‌ని పక్కన పెట్టి, ఒక సైకో డాక్టర్‌గా అద్భుతంగా నటించింది. అలాగే ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్’ ఫేమ్ యూన్ చాన్-యంగ్ ఇందులో ఆమెకు నీడలా ఉండే బాడీగార్డ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. వీరి ముగ్గురి మధ్య సాగే ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సిరీస్ 8 ఎపిసోడ్లతో మైండ్ గేమ్స్, క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్లకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇది ప్రస్తుతం Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జియాంగ్ అనే అమ్మాయి ఒకప్పుడు మెడికల్ కాలేజీలో టాపర్‌. అయితే ఒక చిన్న పొరపాటు వల్ల తన గురువే తన కొంప ముంచి, డాక్టర్ కాకుండా అడ్డుపడి అక్కడి నుంచి బయటకు గెంటేస్తాడు. దాంతో ఆ అమ్మాయి కసిగా పెరిగి, లైసెన్స్ లేకపోయినా దొంగచాటుగా క్లినిక్ నడుపుతూ, వీధి రౌడీలకు, బయటి ప్రపంచానికి తెలియని వాళ్లకు ఆపరేషన్లు చేస్తూ ‘షాడో డాక్టర్’గా మారిపోతుంది. ఇలాంటి టైంలో, తన లైఫ్ నాశనం చేసిన ఆ పాత గురువు మళ్ళీ ఆమె కళ్ళ ముందు పడతాడు. పాత పగలు, కొత్త సెటిల్మెంట్లు అన్నీ కలిపి ఆ గురువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని జియాంగ్ ప్లాన్ వేస్తుంది. ఇద్దరూ మేధావులే కావడంతో, ఒకరిని మించి ఒకరు మైండ్ గేమ్స్ ఆట మొదలుపెడతారు. అసలు ఆ గురువు ఎందుకు ఆమెను అడ్డుకున్నాడు? ఈ అమ్మాయి తన పగను ఎలా తీర్చుకుంది? చివరకు ఎవరు ఎవరికి చెక్ పెట్టారు? అన్నదే ఈ సిరీస్ క్లైమాక్స్. ఇది మెడికల్ స్టోరీ అయినా సరే, సస్పెన్స్ మాత్రం మామూలుగా ఉండదు. నరాలు తెగే ఉత్కంఠతో సాగుతుంది.

Read Also : శ్మశానం పక్కనే పాడుబడ్డ హాస్టల్‌… దెయ్యాల టెన్షన్ తో పిచ్చెక్కిస్తున్న మలయాళ కామెడీ హారర్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×