E-Paper
Advertisement

Crime Thriller Series OTT : పట్టుకొచ్చిన కొద్దీ పారిపోయే కూతురు… అండర్ వరల్డ్ ట్విస్ట్ తో సాగే సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller Series OTT : పట్టుకొచ్చిన కొద్దీ పారిపోయే కూతురు… అండర్ వరల్డ్ ట్విస్ట్ తో సాగే సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Series OTT  : ఓటీటీలో రీసెంట్ గా వచ్చిన ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ తండ్రి కూతుర్ల చుట్టూ తిరుగుతుంది. డ్రగ్స్ కి బానిసైన కూతురి కోసం తండ్రి పడే వేదన ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, థ్రిల్లర్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. మరి ఈ సిరీస్ ని మీరు కూడా చూడాలనుకుంటే ఇప్పుడే ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

ఏ ఓటీటీలో అంటే

హర్లాన్ కోబెన్ ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ పేరు ‘రన్ అవే’ (Run Away). ఇది 2026 జనవరి1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అసలు ఈ స్టోరీ న్యూయార్క్ నేపథ్యంలో ఉన్నప్పటికీ, ఈ సిరీస్‌ను యునైటెడ్ కింగ్‌డమ్ లోని మాంచెస్టర్ పరిసరాల్లో చిత్రీకరించారు. ఇందులో జేమ్స్ నెస్బిట్- సైమన్ గ్రీన్‌గా, మిన్నీ- ఇంగ్రిడ్ గ్రీన్‌గా నటించారు. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ స్థాయిలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సైమన్ గ్రీన్ అనే వ్యక్తికి పైజ్ అనే టీనేజ్ కూతురు ఉంటుంది. అయితే ఆమె డ్రగ్స్ అలవాటు వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. సైమన్ ఆమె కోసం వెతుకుతూనే ఉంటాడు. ఒకరోజు న్యూయార్క్‌లోని ఒక పార్కులో గిటార్ వాయిస్తూ దీనావస్థలో ఉన్న పైజ్‌ను అతను కనిపెడతాడు. సైమన్ తన కూతురిని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు, ఆమె ప్రియుడు ఆరోన్ మధ్యలోకి వస్తాడు. వారి మధ్య జరిగిన గొడవలో సైమన్ ఆరోన్‌ను నెట్టేస్తాడు. ఆ తర్వాత పైజ్ మళ్ళీ పారిపోతుంది. కొద్దిసేపటికే ఆరోన్ దారుణంగా హత్య చేయబడతాడు.

పోలీసులు సైమన్‌ను అనుమానిస్తారు, కానీ తన కూతురు ప్రమాదంలో ఉందని గ్రహించిన సైమన్ ఆమెను వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. పైజ్ కేవలం డ్రగ్స్‌కే కాకుండా, ఒక ప్రమాదకరమైన క్రైమ్ నెట్‌వర్క్‌లో చిక్కుకుందని తెలుస్తుంది. సైమన్ భార్య ఇంగ్రిడ్ కూడా కొన్ని విషయాలను దాచిందని కథ ముందుకు సాగే కొద్దీ తెలుస్తుంది. అసలు ఆ ముఠా ఎవరు? వారు పైజ్‌ను ఎందుకు వెంటాడుతున్నారు? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సైమన్ ఎంత దూరం వెళ్ళాడు ? అనేది క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా సాగుతుంది.

Advertisement

Read Also :  అనుమానాస్పద స్థితిలో భర్త మృతి… ట్విస్టులతో పిచ్చెక్కించే బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×