E-Paper
Advertisement

Crime Thriller OTT : మనిషిని ముక్కలుముక్కలుగా కట్ చేసి… ‘దృశ్యం’ను మించిన ట్విస్టులున్న క్రైమ్ డ్రామా

Crime Thriller OTT : మనిషిని ముక్కలుముక్కలుగా కట్ చేసి… ‘దృశ్యం’ను మించిన ట్విస్టులున్న క్రైమ్ డ్రామా
Advertisement

Crime Thriller OTT : సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ఆడియన్స్ ఎందుకు అంతగా అడిక్ట్ అవుతారంటే… మూవీ స్టార్టింగ్ నుంచి మొదలైన ట్విస్టులు, మలుపులు, ఊహకందని క్లైమాక్స్ వరకూ కథను నడిపిస్తాయి. నెక్స్ట్ రాబోయే ట్విస్ట్ ఏంటి అని బుర్రకు ఎంత పదును పెట్టినా ఒక అంచనా వేయలేని కథ ఉంటుంది. అలాంటి ఒక ఖతర్నాక్ సినిమా గురించే మన మూవీ సజెషన్ లో చెప్పుకుందాం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ‘శాఖాహారి’ (Shakhahaari) అనే కన్నడ మర్డర్ మిస్టరీ గురించి. 2024లో విడుదలైన ఈ మూవీకి సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకుడిగా ఇదే మొదటి మూవీ కావడం గమనార్హం. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో వినయ్ యు.జె., నిధి హెగ్డే, సుజయ్ శాస్త్రి, హరిణి శ్రీకాంత్, శ్రీహర్ష గోభట్ సపోర్టింగ్ రోల్స్ పోషించారు.

Advertisement

2 గంటల 24 నిమిషాల రన్‌టైమ్ తో నడిచే ఈ మూవీని 2024 ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదల చేశారు. బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ మన్ననలు అందుకున్న ఈ మూవీకి IMDbలో 7.5 రేటింగ్ ఉంది. థ్రిల్లర్, లవ్ స్టోరీ వంటి అంశాలు ఉన్న ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఒరిజినల్ కన్నడ వెర్షన్ మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, తెలుగు డబ్డ్ వెర్షన్‌ ను మాత్రం ఆహాలోనే చూడవచ్చు. ఇక మలెనాడు బ్యాక్‌డ్రాప్ లో వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయి.

Read Also :  ఓటీటీలోకి సావిత్రిబాయి – జ్యోతిరావు ఫూలే బయోపిక్… ఎక్కడ చూడొచ్చంటే ?

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

వెజిటేరియన్ హోటల్ అంటే అక్కడ వెజ్ మాత్రమే దొరుకుతుంది అనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మాత్రం ఆ హోటల్, దాని యజమాని డిఫరెంట్ గా ఉంటారు. చివర్లో క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్దాం పదండి.

మలెనాడు ప్రాంతంలోని ఒక చిన్న వెజిటేరియన్ హోటల్ ఉంటుంది. దాని ఓనర్ సుబ్బణ్ణ (రంగాయణ రఘు) రోల్ ఈ సినిమాలో మెయిన్. సుబ్బణ్ణ ది లైఫ్ చాలా సింపుల్ లైఫ్. పని చేసే వాళ్ళకి ఫుడ్ వండి పెడుతూ ఉంటారు. ఒకరోజు అతని జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంటుంది. ఒక మర్డర్ కేసులో నిందితుడు పోలీసుల నుంచి పారిపోతాడు. అతను పోయి పోయి సుబ్బణ్ణ హోటల్ లోనే తల దాచుకుంటాడు. పైగా గాయం కూడా ఉంటుంది కాలికి. ఈ విషయం తెలిసిన సుబ్బణ్ణ ముందుగా అతన్ని పోలీసులకు పట్టించాలి అనుకుంటాడు. కానీ నిందితుడి గతం గురించి తెలుసుకుని కరిగిపోతాడు. ఆ తరువాత అసలు అతన్ని పోలీసులకు అప్పగించాలా లేదా అని సందిగ్ధంలో పడతాడు. అంతలోనే ఆ క్రిమినల్ ప్రాణాలు కోల్పోతాడు. మరి తరువాత సుబ్బణ్ణ ఏం చేశాడు ? ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×