E-Paper
Advertisement

Mi Savitribai Jotirao Phule OTT : ఓటీటీలోకి సావిత్రిబాయి – జ్యోతిరావు ఫూలే బయోపిక్… ఎక్కడ చూడొచ్చంటే ?

Mi Savitribai Jotirao Phule OTT : ఓటీటీలోకి సావిత్రిబాయి – జ్యోతిరావు ఫూలే బయోపిక్… ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Mi Savitribai Jotirao Phule OTT : అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని, సమాజాన్ని తీర్చిదిద్దిన ధీర వనిత సావిత్రిబాయి ఫూలే. 1848లోనే విద్యా ఉద్యమం స్టార్ట్ చేసిన మొట్ట మెుదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆవిడ దళితుల, స్త్రీల విద్య కోసం కృషి చేశారు. తన లైఫ్ టైమ్ లో 52 స్కూల్స్ ప్రారంభించి, ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారు. అయితే ఆమె జర్నీ అంత సాఫీగా ఏం జరగలేదు. ఈ పోరాటంలో సావిత్రీబాయి ఆధిపత్య కులాల నుంచి ఎన్నో దాడులను, అవమానాలను ఎదుర్కొని నిలబడ్డారు. అయినా ఏమాత్రం తగ్గకుండా ఆవిడ చేసిన పోరాటం స్పూర్తిదాయకం. ఇలాంటి ప్రేరణనిచ్చే కథలు తెరపైకి రావడం మంచి విషయం. తాజాగా ఓటీటీలోకి సావిత్రిబాయి ఫూలే బయోపిక్ అడుగు పెట్టింది. మరి ఆమె బయోపిక్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘మీ సావిత్రిబాయి – జ్యోతిరావు ఫూలే’ (Mi Savitribai Jotirao Phule Series) అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ నిజానికి టీవీలో ప్రసారం కావలసి ఉంది. కానీ అంతకంటే ముందే స్టార్ ప్రవాహ్‌ లో టెలివిజన్ ప్రీమియర్‌ కు ముందే, డిజిటల్ అరంగేట్రం చేసింది. జనవరి 5 నుంచి ఈ మరాఠీ షో స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో ప్రారంభమైంది. ఇది సోమవారం నుండి ఆదివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ ప్రవాహ్‌ లో టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రసారం అవుతుంది. మధురాణి గోఖలే, డాక్టర్ అమోల్ కోహ్లే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. మధురాణి గోఖలే ప్రభుల్కర్ సావిత్రీబాయి, డాక్టర్ అమోల్ కోల్హే జోతిరావ్ ఫూలే పాత్రలను పోషించారు. చైత్రాలి గుప్తే, స్వప్నిల్ రాజశేఖర్, సవితా మల్పేకర్, సునీల్ గాడ్బోలే, తక్ష శెట్టి (చైల్డ్ ఆర్టిస్ట్) పోషించారు.

Advertisement

Read Also :  ఆస్కార్ రేసులోకి అడుగుపెట్టిన మరాఠీ మూవీ ‘దశావతార్’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

మొదటి ఎపిసోడ్ లో ఏముంది ?

‘మీ సావిత్రిబాయి – జ్యోతిరావు ఫూలే’ మొదటి ఎపిసోడ్ 30 నిమిషాలు. పూణేలో జరిగిన ఒక ఈవెంట్ లో మధురాణి గోఖలేను సావిత్రిబాయి జ్యోతిరావు ఫూలేగా పరిచయం చేయడంతో ప్రారంభమవుతుంది. తరువాత సావిత్రిబాయి – ఆమె భర్త జోతిరావు ఫూలే సమాజంలో స్త్రీ విద్య కోసం మొదటి అడుగు వేయడాన్ని చూపించారు. పూణేలో భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడానికి చొరవ తీసుకుంటారు ఫూలే దంపతులు. ఈ ఎపిసోడ్ లో జ్యోతి రావు ఫూలేతో సావిత్రిబాయి పెళ్ళిని కూడా చూడవచ్చు. మరి ఈ షోకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×