E-Paper
Advertisement

Dark Comedy Drama OTT : ఇదేం సినిమారా సామీ… ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల్లోకీ వచ్చే ప్రొఫెసర్… క్షణక్షణం ఉత్కంఠ

Dark Comedy Drama OTT : ఇదేం సినిమారా సామీ… ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల్లోకీ వచ్చే ప్రొఫెసర్… క్షణక్షణం ఉత్కంఠ
Advertisement

Dark Comedy Drama OTT : సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఈ రోజుల్లో ప్రజలు ఆరాటపడుతున్నారు. అయితే ఆ పిచ్చి కొంతమందికి ఎక్కువగా ఉంటోంది. క్రేజ్ కోసం పిచ్చి పనులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. సోషల్ మీడియా క్రేజ్, మనుషుల ప్రవర్తన, అభాసు పాలైనప్పుడు ఎదురయ్యే సమస్యలను ఈ సినిమా చాలా డిఫరెంట్ గా చూపించింది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2023లో వచ్చిన ఈ అమెరికన్ సర్రియలిస్ట్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘డ్రీమ్ సినారియో’ (Dream Scenario). ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ ప్రొఫెసర్‌గా ప్రధాన పాత్రలో నటించారు. క్రిస్టోఫర్ బోర్గ్లీ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. జూలియన్నే నికల్సన్, మైఖేల్ సెరా, టిమ్ మెడోస్, డిలాన్ గెలులా, డిలాన్ బేకర్ వంటి నటులు కూడా నటించారు. 2023 సెప్టెంబర్ 9న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయిన ఈ సినిమా, 2023 నవంబర్ 10న థియేటర్లలో విడుదల అయింది. ఇది బాక్సాఫీస్ వద్ద $12.4 మిలియన్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నికోలస్ కేజ్ నటనకు గాను ఆయనకు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు నామినేషన్ లభించింది. ఈ సినిమాను ప్రస్తుతం Amazon Prime Videoలో చూడవచ్చు.

కథలోకి వెళ్తే

Advertisement

పాల్ మాథ్యూస్ (నికోలస్ కేజ్) ఒక ప్రొఫెసర్. అతని జీవితం చాలా సాదాసీదాగా సాగుతుంటుంది. అయితే అకస్మాత్తుగా ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కలల్లో పాల్ కనిపించడం మొదలవుతుంది. మొదట్లో ఆ కలల్లో పాల్ కేవలం ఒక మామూలు మనిషిగా మాత్రమే ఉంటాడు. దీనివల్ల అతను రాత్రికి రాత్రే గ్లోబల్ సెలబ్రిటీ అయిపోతాడు. కానీ కొద్దిరోజుల తర్వాత ఆ కలలు భయంకరమైన పీడకలలుగా మారుతాయి. వాటిలో పాల్ హింసాత్మకంగా కనిపిస్తాడు. దీనివల్ల నిజ జీవితంలో పాల్ పట్ల ప్రజలు అసహ్యం పెంచుకుంటారు. సెలబ్రిటీ స్టేటస్ నుండి అతను తొలగించబడతాడు. సోషల్ మీడియా ప్రభావం, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈ సినిమా కథ.

Read Also : దుమ్మురేపే యాక్షన్ సీన్స్… 13 ఆస్కార్ నామినేషన్లతో చితగ్గొడుతున్న లియోనార్డో డికాప్రియో ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×