E-Paper
Advertisement

Shreyas Media: ‘విశాఖ ఉత్సవ్‍’ ఈవెంట్‍ లో లోపం.. శ్రేయాస్‍ మీడియా పై ఆరోపణలు..

Shreyas Media: ‘విశాఖ ఉత్సవ్‍’ ఈవెంట్‍ లో లోపం.. శ్రేయాస్‍ మీడియా పై ఆరోపణలు..
Advertisement

Shreyas Media: ఏపీ విశాఖ ఉత్సవ్‌ను నగరంలో ఈ నెల 24 నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఈవెంట్ కోసం రూ. 8 కోట్లను కేటాయించింది. ప్రముఖ మీడియా పార్ట్నర్ శ్రేయాస్ మీడియాకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మీడియాపై ఒకవైపు బ్యాడ్ రివ్యూస్ వినిపిస్తున్నా మరోవైపు ఎన్నో సినిమా ఈవెంట్‍ లు సకెస్సు ఫుల్‍ గా చేస్తూ చాలా పాపులర్ సంస్థ శ్రేయాస్‍ మీడియా.. దాంతో ఈ ఈవెంట్ కూడా భారీ సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ మీడియా సంస్థ ఓ వివాదంలో చిక్కుకుంది.. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మీడియా సంస్థ పై ఎటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

వివాదంలో శ్రేయాస్‍ మీడియా సంస్థ..

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల బాధ్యత శ్రేయాస్ మీడియాకు అప్పగించింది. ఈ ఉత్సవం ఇంకా మొదలవ్వకముందే ఈ మీడియా సంస్థపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘విశాఖ ఉత్సవ్’ ఏర్పాట్ల బాధ్యతలను ఏపీ పర్యాటక శాఖ శ్రేయాస్ మీడియాకు అప్పగించింది. Sea to Sky థీమ్‌తో 20 వేదికలపై 500కు పైగా కార్యక్రమాలు, 650 మంది కళాకారులతో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు చేసారు. అయితే ఈ ఈవెంట్ ప్రాంగణంలో స్టాలు నిర్వహణకోసం 30 నుంచి 70 వేల రూపాయలు వసూలు చేసిన శ్రేయాస్‍ మీడియా వారు స్టాలు ఏర్పాట్లలో సరైన వసతులు ఇవ్వలేదని స్టాలు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రేయాస్‍ మీడియా కేటాయింపు పై ఇప్పటికే ఆరోపణలు అనుమనాలు వినిపిస్తూన్న తరణం లోనే ఈవెంట్‍ నిర్వహణ లో వైపల్యం గురించి బాధితులు లబో దిబో అంటున్నారు. స్టాలు నిర్వాహకులు శ్రేయస్ మీడియా ప్రవర్తనపై మండిపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. మరి దీనిపై శ్రేయాస్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి..

Advertisement

Also Read : ఆదివారం స్పెషల్.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

విశాఖ ఉత్సవ్.. 

నిజానికి ఈ విశాఖ ఉత్సవ్‌ అంటే.. ఆ ప్రాంతంలోని యువత టాలెంట్ ను ప్రపంచానికి చూపించే ఒక గొప్ప వేదిక. గత ఏడాది జరిగిన ఉత్సవం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే, గతంలో విశాఖకు చెందిన ఈవెంట్‌ ఆర్గనేజైషన్లకే ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. లోకల్‌ కళాకారులు తమ ప్రతిభ కనబరిచేవారు. ప్రస్తుతం బడ సంస్థ శ్రేయస్ మీడియాకు ఏపీ ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.. ఎప్పటి మాదిరిగానే డిసెంబర్‌ నెలలో నిర్వహించాలన్న ఆలోచన కూడా చేసింది. కొన్ని అనుకోని కారణాలవల్ల అది జనవరి కి షిఫ్ట్ అయింది. ఈ కార్యక్రమం మొదలు అవ్వడంతో వివాదాలు తలెత్తడం తో జనాలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం గురించి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×