E-Paper
Advertisement

Dark fantasy series ott : దేవకన్యతో డిటెక్టివ్ ప్రేమ… విజువల్ వండర్ ఈ ఫాంటసీ సిరీస్

Dark fantasy series ott : దేవకన్యతో డిటెక్టివ్ ప్రేమ… విజువల్ వండర్ ఈ ఫాంటసీ సిరీస్
Advertisement

Dark fantasy series ott : వెబ్ సిరీస్ లను ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువాగా ఫాలో అవుతున్నారు. వీటిలో ఫాంటసీ సిరీస్ లకు కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వీళ్ళ కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్. ఇది యుద్ధం కంటే మానవత్వం ఐక్యత గొప్పవని చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యుద్ధం కారణంగా తమ నివాసాలను కోల్పోయి, శరణార్థులుగా మానవుల నగరానికి వచ్చిన ఫెయిరీలు, ఫాన్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డార్క్ ఫాంటసీ, డిటెక్టివ్ థ్రిల్లర్‌లను ఇష్టపడితే, ఈ సిరీస్ ను మిస్ చేయకండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ ఫాంటసీ టెలివిజన్ సిరీస్ పేరు ‘కార్నివల్ రో’ (Carnival Row). ఈ సిరీస్ మొత్తం రెండు సీజన్లతో ముగిసింది. సీజన్ 1, 2019లో 8 ఎపిసోడ్లతో విడుదలైంది. ఇక సీజన్ 2, 2023లో 10 ఎపిసోడ్లతో వచ్చింది. ఇందులో ఓర్లాండో బ్లూమ్ ఇన్‌స్పెక్టర్ ఫిలోస్ట్రేట్ పాత్రలో. కారా డెలివిన్, విగ్నెట్ స్టోన్‌మోస్ (ఫెయిరీ) పాత్రలో నటించారు. ఇది Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : పదేళ్ళ తరువాత ట్రెండింగ్ లో 113 నిమిషాల నిడివి ఉన్న డార్క్ థ్రిల్లర్… నరాలు తెగే ఉత్కంఠ

స్టోరీ ఏమిటంటే

భూమి మీద మానవులతో పాటు ఫెయిరీలు (రెక్కలు ఉన్న జీవులు), ఫాన్లు (తల మీద కొమ్ములు ఉన్న జీవులు) వంటి జీవులు కూడా ఉంటారు. యుద్ధం కారణంగా ఈ వింత జీవులు తమ మాతృభూమిని కోల్పోయి, శరణార్థులుగా మానవుల నగరమైన ‘ది బర్గ్’కు వస్తారు. అయితే అక్కడ వాళ్ళని ‘క్రిచ్’ (Critch) అని పిలుస్తూ తక్కువ చూపు చూస్తారు. ఇక వీళ్ళ జీవనం కూడా ఒక మురికివాడలో ఉంటుంది. ఇక నగరంలో ఫెయిరీల తెగలో ముఖ్యమైన వ్యక్తులపై భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. వీటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఫిలోకు, ఈ హత్యల వెనుక ఒక రాక్షసుడు ఉన్నాడని తెలుస్తుంది. చివరికి మానవ నగరం శరణార్థుల కోసం ఒక బందీఖానాగా మారుతుంది. అక్కడ ఫెయిరీలను బయటకు రాకుండా లాక్ చేస్తారు.

Advertisement

రెండవ సీజన్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయి. ఫెయిరీల హక్కుల కోసం పోరాడే ఒక తీవ్రవాద టీం మానవులపై దాడులు చేస్తుంది. ‘స్పారాస్’ అనే అత్యంత శక్తివంతమైన రాక్షసుడు నగరంలో అల్లకల్లోలం సృష్టిస్తాడు. ఫిలో నగరంలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తాడు. మరి చివరికి అక్కడ శాంతి నెలకొందా ? మానవులతో పాటు ఫెయిరీలు కూడా సంతోషంగా జీవిస్తారా ? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×