E-Paper
Advertisement

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. 20 మందిపైగానే మృతి, మరో 70 మంది

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. 20 మందిపైగానే మృతి, మరో 70 మంది
Advertisement

Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొట్టాయి. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అసలు ఘటన ఎలా జరిగింది?

స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ

Advertisement

దక్షిణ స్పెయిన్‌లో అడాముజ్‌ ప్రాంతం వద్ద రైలు ప్రమాదం జరిగింది. మాలాగా నుంచి మాడ్రిడ్‌కి దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు కార్డోబా సమీపంలో పట్టాలు తప్పింది. అదే సమయంలో మాడ్రిడ్ నుండి దక్షిణ స్పానిష్ సిటీకి హుయెల్వాకు దాదాపు 200 మంది ప్రయాణికులతో వస్తున్న రైలుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లో 21 మంది మృతి చెందారు.

అయితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అధికారులు భావించారు. మరో వంద మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు రైళ్లలో ప్రయాణించేవారు దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ఘటన నుంచి సమాచారం తెలియగానే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. గాయపడిన ప్రయాణికులను బోగీల నుంచి బయటకు తీసి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Advertisement

20 మంది మృతి.. 70 మందికిపైగా గాయాలు

ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆ దేశ ప్రధాని పెడ్రో, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్పెయిన్ రవాణా మంత్రి ఆస్కార్ మాట్లాడుతూ అర్ధరాత్రి తర్వాత ఘటన జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.

ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, బాధితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి వుందన్నారు. మే నెలలో పునరుద్ధరించబడిన ఒక ఫ్లాట్ ట్రాక్‌పై ఈ ఘటన జరిగిందన్నారు.  వింత ఘటనగా ఆయన అభివర్ణించారు. ట్రాక్‌పైకి దూకిన రైలు నాలుగేళ్లుగా సేవలు అందిస్తోందన్నారు. ఆ రైలు ఇర్యో ప్రైవేట్ కంపెనీ చెందినది.

ALSO READ: ఇండోనేషియాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఈ ఘటనపై అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఇర్యో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి రైలు రెండు బోగీలు ట్రాక్ నుండి 13 అడుగుల వాలుపై పడినట్టు సదరు మంత్రి తెలిపారు. రెన్ఫే రైలు ముందు భాగానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు నెల పట్టవచ్చన్నారు.

గాయపడిన 73 మంది ప్రయాణికులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు అండలూసియా ప్రాంతీయ ఆరోగ్య అధిపతి ఆంటోనియో సాన్జ్ తెలిపారు. ఒక రైలు తీవ్రంగా దెబ్బ తిందని, కనీసం నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయని అన్నారు.ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు. ఘటన తర్వాత ప్రయాణీకులు కిటికీలను పగలగొట్టడానికి సుత్తులను ఉపయోగించారు. దాని ద్వారా కొందరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

 

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×