E-Paper
Advertisement

Action Thriller OTT: పదేళ్ళ తరువాత ట్రెండింగ్ లో 113 నిమిషాల నిడివి ఉన్న డార్క్ థ్రిల్లర్… నరాలు తెగే ఉత్కంఠ

Action Thriller OTT: పదేళ్ళ తరువాత ట్రెండింగ్ లో 113 నిమిషాల నిడివి ఉన్న డార్క్ థ్రిల్లర్… నరాలు తెగే ఉత్కంఠ
Advertisement

Action Thriller OTT : ఈ రోజుల్లో డార్క్ థ్రిల్లర్ జానర్ క్రేజ్ బాగా పెరుగుతోంది. భాషతో సంబంధం లేకుండా ఇలాంటి సినిమాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే 2014లో వచ్చిన డార్క్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. సినిమా వచ్చి దశబ్ధం అవుతున్నా దీనికి క్రేజ్ మాత్రం తగ్గటంలేదు. 1 గంట 53 నిమిషాల సినిమా ఎక్కడా బోర్ అనిపించకుండా ఉంటుంది. దీన్ని చూస్తున్నప్పుడు ఒక్క క్షణం కూడా రెప్పవేయడానికి సాహసించరు. ఈ సినిమాలో ఒక ప్రముఖ బాలీవుడ్ నటి ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఐయండిబిలో కూడా 7.3/10 అత్యధిక రేటింగ్‌ పొందింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే.

ఈ సినిమా పేరు ఏమిటంటే

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాపేరు ‘మర్దానీ’ (Mardaani). 2014లో వచ్చిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్ టాప్ 10 లో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించాడు. రాణీ ముఖర్జీ, అవ్‌నీత్ కౌర్, తాహిర్ రాజ్ భాసిన్, జిషు సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2014 ఆగస్టు 22న విడుదలైంది. మర్దానీ 3 చుట్టూ ఉన్న సందడి మధ్య, ప్రజలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా మొదటి భాగాన్ని పదే పదే చూస్తున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరిలో ‘మర్దానీ 3’ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

Read Also :  టైమ్ ట్రావెల్ చేసి అమ్మాయిల ప్రపంచంలో ఇరుక్కునే అబ్బాయిలు… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా

స్టోరీ ఏమిటంటే

ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే శివానీ (రాణి ముఖర్జీ) ఒక అనాధ అమ్మాయి కిడ్నాప్ కేసును విచారిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక ప్రమాదకరమైన మానవ అక్రమ రవాణా, డ్రగ్ మాఫియా ముఠాను కనిపెడుతుంది. ఈ ముఠాకు నాయకుడైన కరణ్ రస్తోగి (తాహిర్ రాజ్ భసిన్) చాలా క్రూరమైన వ్యక్తి. అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమమేస్తుంటాడు. ఇక స్టోరీలో యాక్షన్ మొదలవుతుంది. శివానీ అతనితో గట్టిగానే పోరాడుతుంది ఈ సినిమాలో. కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి ఆమె అతని అక్రమాలకు అడ్డుకట్ట ఎలా వేసిందనేదే ఈ కథ. మీరు ఈ సినిమాని చూడకపోయి ఉంటే ఓ లుక్ వేయండి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×