E-Paper
Advertisement

Crime Thriller Web Series : ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ రికార్డును బ్రేక్ చేసిన సిరీస్… ఇంకా చూడలేదా ?

Crime Thriller Web Series : ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ రికార్డును బ్రేక్ చేసిన సిరీస్… ఇంకా చూడలేదా ?
Advertisement

Crime Thriller Web Series : ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న థ్రిల్లర్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’. కానీ ఓ లేడి సైకో కిల్లర్ సిరీస్ ఇలాంటి సిరీస్ ను కూడా అధిగమించి షాక్ ఇచ్చింది. ఈ 6-ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన థ్రిల్లర్‌ గా చరిత్రను సృష్టించింది. మరి ఆ సిరీస్ ఏంటి ? వ్యూస్ ఎన్ని కొల్లగొట్టింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

‘స్ట్రేంజర్ థింగ్స్’ను బీట్ చేసిన సిరీస్ ఇదే

గత కొన్ని రోజులుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఒక వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. అదే ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ వ్యూస్ పరంగా ఇది ఆరు ఎపిసోడ్‌ల థ్రిల్లర్ డ్రామా ముందు ఓడిపోయింది. అవును, ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ను అధిగమించి షాక్ ఇచ్చింది మరో ఇండియన్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ కు IMDb లో 6.2 రేటింగ్ ఉండవచ్చు, కానీ సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, క్రైమ్‌లతో నిండి ఉన్న ఈ సిరీస్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెడితే ఆ సిరీస్ పేరు ‘మిసెస్ దేశ్‌పాండే’ (Mrs Deshpande). ఈ సిరీస్‌లో ఒకప్పటి అందాల తార మాధురి దీక్షిత్ సైకో కిల్లర్ గా నటించింది. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 19 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మినీ సిరీస్ ‘లా మాంటే’కి రీమేక్ గా రూపొందించారు.

Advertisement

డిసెంబర్ 22 నుండి 28వ తేదీ వరకు భారతదేశంలో ఓటీటె వ్యూయర్‌షిప్ డేటాను Ormax మీడియా పంచుకుంది. మాధురి దీక్షిత్ కొత్త సిరీస్ ఆ వారం 4.2 మిలియన్ల వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉంది. ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2’ ఆ వారం 3.3 మిలియన్ల వ్యూస్‌తో రెండవ స్థానంలో నిలిచింది. అయితే అంతర్జాతీయంగా, స్ట్రేంజర్ థింగ్స్ మాధురి దీక్షిత్ షోను 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అధిగమించింది.

Read Also :  చీకట్లో సైకో దెయ్యం పైశాచికత్వం… ఒళ్లు గగుర్పొడిచేలా ఒక్కో సీన్… ఒంటరిగా చూడొద్దు భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ముంబైలో ఒక సైకో కిల్లర్ నైలాన్ రోప్ ను మెడకి బిగించి వరుస హత్యలు చేస్తుంటాడు. అలా హత్య చేసిన తరువాత ఆ బాడీని అద్దానికి ఎదురుగా కూర్చోబెట్టి, శవం కళ్లు తెరుచుకుని ఉండేలా ప్లాన్ చేస్తాడు. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ, పోలీసులకు అంతుపట్టని మిస్టరీగా మారిన ఈ కేసును ఎలా పరిష్కరించాలో కమిషనర్ అరుణ్ ఖత్రి (ప్రియాన్షు ఛటర్జీ)కి అంతుచిక్కదు. అందుకే స్పెషల్ ఆఫీసర్ గా తేజస్ (సిద్ధార్థ్ చందేకర్)ను ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దింపుతారు.

తన్వీ (దీక్షా జునేజా)తో కలిసి తేజస్ సంతోషంగా ఉంటాడు. అయితే అప్పటికే అతన్ని మరో అండర్ కవర్ ఆపరేషన్ కు పంపి ఉంటారు. కానీ ఈ కేసు కోసమే అత్యవసరంగా మధ్యలోనే పిలిపిస్తారు. అయితే గతంలో ఈ తరహా హత్యలు జరిగాయని, ఆ హత్యలు చేసిన మిస్సెస్ దేశ్ పాండే (మాధురీ దీక్షిత్) ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉందని తేజస్ తో కమిషనర్ చెప్తాడు. ప్రస్తుతం వరుస హత్యలకు పాల్పడుతున్న హంతకుడిని పట్టుకోవడానికి ఆమె హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆమె తరహాలోనే హత్యలు చేస్తున్న కిల్లర్ ను పట్టుకోవడం ఒక ఛాలెంజ్ అయితే, దేశ్ పాండే పారిపోకుండా చూసుకోవడం ఇక్కడ మరో ఛాలెంజ్. మరి తేజస్ ఏం చేశాడు ? కిల్లర్ ను దేశ్ పాండే ఎలా పట్టించింది ? అన్నది తెరపై చూడాల్సిన అంశం.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×