BigTV English
Advertisement

OTT Movie : భర్త కళ్ల ముందే సీరియల్ కిల్లర్ భార్యతో అలా.. ప్రభాస్ విలన్ డేంజరస్ షాకింగ్ మూవీ

OTT Movie : భర్త కళ్ల ముందే సీరియల్ కిల్లర్ భార్యతో అలా.. ప్రభాస్ విలన్ డేంజరస్ షాకింగ్ మూవీ

OTT Movie : ప్రేమ కథలకు బ్లడ్ బాత్, సస్పెన్స్ థ్రిల్లర్ వంటి అంశాలు మిక్స్ చేస్తే, ఇక ఆ సినిమాలకు తిరుగుండదు. అలాంటి ఓ అదిరిపోయే కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ ఈ రోజు మన మూవీ సజెషన్. అయితే ఈ మూవీని ఒంటరిగా ఉన్నప్పుడు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ చూడాలని గుర్తు పెట్టుకోండి. కానీ దీన్ని పిల్లలతో చూడకండి. కాదని చూస్తే బుక్కైపోతారు. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించింది డాంగ్-సియోక్.  ప్రభాస్ కు విలన్ గా నటించాలని ఆయన అభిమానులు కోరుకునే కొరియన్ పాపులర్ యాక్టర్ ఈయన. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.


స్టోరీలోకి వెళ్తే
జూన్-సిక్ (జో హాన్-సన్), సో-యోన్ (కిమ్ మిన్-క్యుంగ్) పెళ్లై 5 ఏళ్లు అవుతుంది. అయితే ఇన్నేళ్ల తరువాత వచ్చిన ప్రెగ్నెన్సీ కాస్తా అబార్షన్ కావడంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం దెబ్బతింటుంది. జూన్-సిక్‌ కు చెప్పుకోలేని సమస్య ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి సో-యోన్ ఒక మారుమూల ద్వీపంలోని ఒక గెస్ట్‌హౌస్‌కు ట్రిప్‌ను బుక్ చేస్తుంది. ఇది ఇద్దరి రిలేషన్‌షిప్‌ను బెటర్ చేస్తుందని ఆమె ఆశిస్తుంది.

జూన్-సిక్, సో-యోన్ ద్వీపంలో సంగ్-చుల్ (మా డాంగ్-సియోక్) అనే రెస్టారెంట్ యజమాని, అతని సోదరి నడిపే ఒక గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. సంగ్-చుల్ మొదట ఫ్రెండ్లీగా కనిపిస్తాడు. కానీ ఆ ఊర్లో ఫోన్ సిగ్నల్స్ ఉండవు. మనుషులు ఎవ్వరూ కన్పించరు. ట్రావెలింగ్ కూడా కష్టమే. పైగా అతని వింత ప్రవర్తన, గెస్ట్‌హౌస్‌లోని అసౌకర్యవంతమైన వాతావరణం ఆ జంటను ఆందోళనకు గురి చేస్తుంది. సంగ్-చుల్ సిస్టర్ తో హీరోయిన్ మాట్లాడదాము అనుకున్నా ఆమె పెదవి విప్పదు.


ఆ రోజు రాత్రి సంగ్-చుల్ జూన్-సిక్‌కు బాగా మద్యం తాగిస్తాడు. అతని సోదరి జూన్-సిక్‌ వైఫ్ అక్కడ అందరూ ఉండగానే అతన్ని రెచ్చగొడుతుంది. ఇద్దరినీ స్వయంగా అతనే రూమ్ లోపలకు పంపుతాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించి సంగ్-చుల్ సో-యోన్‌పై దాడి చేస్తాడు. పుణ్యకాలం కాస్తా గడిచిపోయాక వీడు తేడా అనే విషయాన్ని ఇద్దరూ తెలుసుకుంటారు. అప్పటికి హీరోయిన్ చెబుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్లిపోదాం రా సామీ అని. ఇక చివరికి ఇద్దరినీ చితక్కొట్టి, వేరు వేరు రూముల్లో బంధిస్తాడు ఆ సైకో.

ఈ భయంకరమైన సంఘటన తర్వాత మరొక జంట ఆ గెస్ట్‌ హౌస్‌ కు బలి కావడానికి వస్తుంది. సంగ్-చుల్ ఆ జంటలోని స్త్రీపై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా ఆ జంటలోని అబ్బాయిని చంపేస్తాడు. ఈ హత్యతో జూన్-సిక్, సో-యోన్‌లకు సంగ్-చుల్ ఒక సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. వాళ్ళు తమ ప్రాణాను కాపాడుకోవడానికి, ఆ ద్వీపం నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు? చివరికి ఎలా బయట పడ్డారు? సంగ్-చుల్ సిస్టర్ అని చెప్పుకుంటున్న ఆ అమ్మాయి ఎవరు? అనే విషయాలను తెరపై చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొరియన్ క్రైమ్ డ్రామా పేరు ‘డీప్ ట్రాప్’ (Deep Trap). 2015లో విడుదలైన దక్షిణ కొరియా సైకలాజికల్ థ్రిల్లర్ ఈ మూవీ. దీనికి క్వాన్ హ్యూంగ్-జిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మా డాంగ్-సియోక్, జో హాన్-సన్, కిమ్ మిన్-క్యుంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నిజమైన క్రైమ్ ఆధారంగా రూపొందిన చిత్రం. లయన్స్ గేట్ ప్లేలో (Lionsgate Play) హిందీ, తెలుగు, తమిళం, కొరియన్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక సినిమా ఆ సీన్స్ కోసమే తీశారా అన్నట్టుగా పిచ్చెక్కించే  సీన్స్ తో ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడొద్దు.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×