BigTV English

Shree Vishnu : హీరో శ్రీవిష్ణుకు ఘోర అవమానం.. అర్రె ఇంకా గుర్తించట్లేదా..?

Shree Vishnu : హీరో శ్రీవిష్ణుకు ఘోర అవమానం.. అర్రె ఇంకా గుర్తించట్లేదా..?

Shree Vishnu : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చెయ్యాల్సిన లేదు.. ఒకప్పుడు హీరో ఫ్రెండ్ గా కనిపించి తన కామెడితో నవ్వించేవాడు. సామజవరగమన మూవీతో హీరో అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. స్వాగ్ మూవీతో హిట్ టాక్ ను అందుకున్న ఈయన ఈ ఏడాది సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీ చిత్రీ కరణ పూర్తి చేసుకొని మే9 న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఆయన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..


టాలీవుడ్ ఇండస్ట్రీలో అవమానం..

శ్రీవిష్ణు నటించిన లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’ మే 9న థియేటర్లకు రాబోతుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ ట్రైలర్‌తో హైప్‌ పెంచిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని, 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌తో రెడీగా ఉంది. ప్రమోషన్లలో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఈ మధ్య వివాదాలను కోరి తెచ్చుకున్నాడు. దానిపై వివరణ ఇచ్చి కాస్త సేఫ్ అయ్యాడు.. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాడు. ఆయన ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో హీరోలకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉండేదని విన్నాను.. కానీ అప్పటికి నేను హీరో కాలేదు అని చెప్పారు. హీరో అయిపోయారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని యాడ్ చేయలేదా? అని యాంకర్ అడగ్గా నాకు తెలీదండి… దాని గురించి పట్టించుకోలేదు కూడా అని సమాధానమిచ్చారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో శ్రీవిష్ణును ఇంకా హీరోగా టాలీవుడ్ పెద్దలు గుర్తించలేదా? బడా హీరోలకు మాత్రమే గౌరవం ఇస్తారా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.


Also Read: నాని వేట.. కలెక్షన్ల మోత..ఐదు రోజులకు ఎన్ని కోట్లంటే..?

ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్.. 

ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అదే విధంగా శ్రీవిష్ణుకు కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు.. ఈశ్వర్ సినిమా నుంచి ఆయనకు తాను డై హార్ట్ ఫ్యాన్‌ అని చెప్పారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘సింగిల్’ ట్రైలర్‌లో కొన్ని సంభాషణలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీవిష్ణు కన్నప్ప టీమ్‌కి క్షమాపణలు చెప్పారు. సంబంధిత సీన్స్ తొలగించాలని.. అవి సినిమాలో ఉండవని అన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.. ఇప్పటివరకు హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈయన సింగిల్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×