Ap Govt: చంద్రబాబు సర్కార్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇకపై విదేశాల్లో చదువుకోలేక పోతున్నామనే చింత అవసరం లేదు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూటమి సర్కార్ భరోసా ఇచ్చింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఏంటి ఆ పథకం విశేషాలు. విద్యార్థులకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది?
విదేశాల్లో చదవనున్న విద్యార్థులకు శుభవార్త
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఊహించని కానుక ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆయా విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ బీసీ, కాపు వర్గాలలోని పేద విద్యార్థులు అవకాశం కల్పించనుంది. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
ఈ స్కీమ్‌పై అధికారులు దృష్టి సారించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం-Ambedkar overseas vidya nidhi కింద అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు సహాయం చేయనుంది. బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు సహాయం చేయనుంది. ఇక ఈ బీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఇవ్వాలన్నది ప్రతిపాదన.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కీమ్
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే విదేశీ విద్య కేవలం పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులకు మాత్రమే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని వర్తించే ప్రతిపాదనలు రెడీ చేసిందని ప్రభుత్వ వర్గాల మాట. ఈ స్కీమ్ కింద ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు అధికారులు.
ALSO READ: భారీ వర్షాల బెడద.. తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ అలర్ట్
క్యూఎస్ ర్యాంకింగ్ ఆధారంగా టాప్-250 యూనివర్సిటీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పథకం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం లభిస్తుందని అంటున్నారు మంత్రి లోకేష్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని మళ్లీ ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏ విధంగా సాయం
నార్మల్‌గా అయితే 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఓవర్సీస్ విద్యా పథకం అమలు చేసింది. దీనివల్ల చాలామంది లబ్ది పొందారు కూడా. వైసీపీ హయాంలో విదేశీ విద్య పథకానికి పేరు మార్చారు. విద్యార్థులను ఫిల్టర్ చేసేందుకు క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్-50 వర్సిటీల్లో ప్రవేశాలు పొందినవారికి సాయం అందేలా ఈ పథకానికి తెచ్చారు. దీనిపై వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్యూఎస్ ర్యాంకింగ్ ప్రాతిపదికగా తీసుకుంటోంది. కాకపోతే టాప్-250 యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందినవారికి ఆర్థికసాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనుంది ప్రభుత్వం. ఈసారి ప్రభుత్వం మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నది ఆలోచన.