E-Paper
Advertisement

Delhi Crime Season 3 on OTT : పిల్లలపై వేధింపులు… అమ్మాయిల అక్రమ రవాణా… మోస్ట్ అవైటింగ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

Delhi Crime Season 3 on OTT : పిల్లలపై వేధింపులు… అమ్మాయిల అక్రమ రవాణా… మోస్ట్ అవైటింగ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Delhi Crime Season 3 on OTT : ఆడియన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఢిల్లీ క్రైమ్’ సీజన్ 3 ఓటీటీలోకి వచ్చేసింది. గత రెండు సీజన్లు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు వచ్చే మూడవ సీజన్ పై అంచనాలు పెరిగాయి. ‘ఢిల్లీ క్రైమ్‌’ 2019 మార్చిలో వచ్చిన తొలి సీజన్‌ లో నిర్భయ కేసు ఆధారంగా, 2022 ఆగస్టులో వచ్చిన రెండో సీజన్‌ లో సీనియర్ సిటిజన్స్ వరుస హత్యల కేసును, ఉత్కంఠ భరితమైన ఇన్వెస్టిగేషన్ తో చూపించారు. ఇప్పుడు మూడవ సీజన్, 6 ఎపిసోడ్స్ తో మైండ్ ని బ్లాక్ చేసే థ్రిల్లింగ్ సీన్స్ తో వచ్చింది. ఈ సీజన్ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఒక భయంకరమైన ముఠాను డీసీపీ పట్టుకునే క్రమంలో ఉత్కంఠంగా నడుస్తుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ సిరీస్.
ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ కథ ఏమిటి ? అనే వివారాలను కూడా తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో

తనూజ్ చోప్రా రూపొందించిన ‘డెల్హీ క్రైమ్’ (Delhi Crime) సీజన్ 3, 2025 నవంబర్ 13న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో షెఫాలీ షా (వర్తికా చతుర్వేది పాత్రలో), రాజేష్ తైలాంగ్ (విమల్ యాదవ్ పాత్రలో), హుమా ఖురేషి (బడీ దీదీ పాత్రలో), రస్మికా దుగ్గల్ (నీతి సింగ్ పాత్రలో) నటించారు. ఈ సిరీస్ International Emmy Award for Best Drama Series అవార్డ్ ను గెలిచి, ఐయండిబిలో 8.5/10 రేటింగ్ ని కూడా పొందింది. ఇది రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ క్రైమ్ స్టోరీతో ఇండియన్ పోలీస్ సిస్టమ్, సొసైటీ సమస్యలను గ్రిప్పింగ్‌గా చూపిస్తుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సీజన్ 2012లో ఢిల్లీలో జరిగిన ‘బేబీ ఫలక్’ అనే అత్యంత దారుణమైన రియల్ కేసు ఆధారంగా రూపొందించబడింది. ఇది ఢిల్లీ పోలీసుల దర్యాప్తును, ముఖ్యంగా మానవ అక్రమ రవాణా (Human Trafficking) అనే భయంకరమైన సమస్యను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కథలో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో తీవ్రమైన గాయాలతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు సంవత్సరాల చిన్నారిని చేర్చుతారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందిస్తారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) వర్తికా చతుర్వేది (షెఫాలీ షా) ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.

OTT Movie : 24 గంటలూ అదే యావ… అమ్మాయిలతో ఆటగాడి అరాచకం… ఈ మూవీ సింగిల్స్ కు మాత్రమే మావా

Advertisement

చిన్నారి పరిస్థితి చూసి పోలీసులు కూడా చలించిపోతారు. మొదట ఇది గృహహింస కేసుగా భావించినా, దర్యాప్తు సాగే కొద్దీ ఇది ఒక పెద్ద నేర సామ్రాజ్యంలో భాగమని తెలుస్తుంది. చిన్నారి తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. వాళ్ళందరూ ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో బాధితులని బయటపడుతుంది. ఈ నెట్‌వర్క్ ఢిల్లీలోనే కాకుండా, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు విస్తరించి ఉంటుంది. పోలీసులు ఈ కేసును ఛేదిస్తున్నప్పుడు, వాళ్ళకు ‘బడీ దీదీ’ అనే ఒక క్రూరమైన మహిళా డాన్ గురించి తెలుస్తుంది. మొత్తం రాకెట్‌ను ఈమెనే నడుపుతుంటుంది. ఆమెను పట్టుకోవడానికి వర్తికా బృందం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతారు. ఈ క్రమంలో వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. చివరికి వాళ్ళు బడీ దీదీని, ఆమె నెట్‌వర్క్‌ను ఎలా పట్టుకుంటారు ? ఆ చిన్నారికి న్యాయం ఎలా దక్కింది ?అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×