BigTV English

OTT Movie : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్

OTT Movie : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్

OTT Movie : ప్రేమ అనే పదం రెండు అక్షరాలు మాత్రమే. కానీ అది సృష్టించే విధ్వంసం చాలా భయంకరంగా ఉంటుంది. నిజ జీవితంలో ఎంతోమందిని ఎన్నోరకాలుగా ఆడేసుకుంది ఈ ప్రేమ. ఈ అనుభవాలనుంచి వచ్చిన ‘దేవదాసు’ సినిమా అప్పట్లోనే ఒక సెన్సేషన్ . అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కాస్త ట్రెండీగా ఉంటుంది. ప్రేమను వదులుకుని, వేశ్యతో స్నేహం చేసే ఒక యువకుడి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. దీనికి 2010 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ (దేఓల్), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (కోచ్లిన్), బెస్ట్ మ్యూజిక్ (త్రివేది), బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డైలాగ్‌లను గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘దేవ్.డి’ (Dev.D) ఒక హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం శరత్ చంద్ర చటోపాధ్యాయ 1917 లో రచించిన నవల దేవదాస్కు కి ఆధునిక రీటెల్లింగ్. ఇందులో అభయ్ దేఓల్ (దేవ్), మహీ గిల్ (పారో), కల్కి కోచ్లిన్ (చందా), దిబ్యేందు భట్టాచార్య, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. ఈ సినిమా 2009 ఫిబ్రవరి 6న విడుదలై, IMDbలో 7.9/10 రేటింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే

చండీగఢ్‌లో దేవేందర్ సింగ్ ధిల్లాన్ అలియాస్ దేవ్ ఒక సంపన్న వ్యాపారవేత్త కొడుకు. పార్వతి అలియాస్ పారో తో చిన్నప్పటి నుండి ప్రేమలో ఉంటాడు. లండన్‌లో చదువు తర్వాత తిరిగి వచ్చిన దేవ్, పారోను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అతని అహంకారం కారణం తలకెక్కుతుంది. ఎవరో సృష్టించిన పుకార్లను నమ్మి ఆమెను నిష్కారణంగా అవమానిస్తాడు. దుఃఖంలో మునిగిన పారో ఆ తరువాత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే దేవ్ దిల్లీకి వెళ్లి, మద్యం, డ్రగ్స్‌లో మునిగిపోతాడు. అక్కడ అతను చందా అనే ఒక వేశ్యని కలుస్తాడు. ఆమె గతంలో స్కూల్‌గర్ల్‌గా ఉన్నప్పుడు, ఒక MMS స్కాండల్‌ వల్ల ఆమె జీవితం నాశనమైంది. ఇప్పుడు దేవ్, చందా మధ్య స్నేహం ఏర్పడుతుంది. కానీ దేవ్ తన పాత ప్రేమను ఇంకా తలుచుకుని బాధపడుతుంటాడు.

దీని వల్ల దేవ్ జీవితం మరింత క్షీణిస్తుంది. అతను డ్రగ్ డీలర్లు, అవినీతి పోలీసులతో చిక్కుకుంటాడు. ఈ సమయంలో చందా అతనికి మద్దతుగా నిలుస్తుంది. మరోవైపు పారో తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఏమాత్రం ఉండదు. ఆమె దేవ్‌ను మళ్లీ కలుస్తుంది. కానీ అతని వ్యసనం, అహంకారం ఆమెను మళ్ళీ దూరం చేస్తాయి. ఇక దేవ్ తన తప్పులను తెలుసుకుంటాడు. ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవాల్సిన సమయం వస్తుంది. క్లైమాక్స్ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. దేవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? ఎవరితో జీవితం పంచుకుంటాడు ? డ్రగ్స్ తో నే సావాసం చేస్తాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : అజ్ఞాత వ్యక్తి నుంచి గిఫ్ట్స్… అమ్మాయే కదాని కిడ్నాప్ చేస్తే, నరకం చూపించే లేడీ సైకో… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా

Related News

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని మరొకడితో… డైరెక్ట్ గా మొగుడికే చెప్పే ఇల్లాలు… అతనిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : ల్యాబ్ లో అమ్మాయిల అస్థి పంజరాలు… కపుల్ ను కలవనివ్వని దెయ్యం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్

OTT Movie : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : 2 ఓటీటీల్లోకి 105 కోట్ల రివేంజ్ డ్రామా… ఆ సీన్లు కూడా… ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాక్

Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!

Big Stories

×