BigTV English

OTT Movie : అజ్ఞాత వ్యక్తి నుంచి గిఫ్ట్స్… అమ్మాయే కదాని కిడ్నాప్ చేస్తే, నరకం చూపించే లేడీ సైకో… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా

OTT Movie : అజ్ఞాత వ్యక్తి నుంచి గిఫ్ట్స్… అమ్మాయే కదాని కిడ్నాప్ చేస్తే, నరకం చూపించే లేడీ సైకో… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా

OTT Movie : ఒక హాలీవుడ్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులకు స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ సినిమా మొదట సరదాగా నడుస్తూ ఆతరువాత ఊహించని విధంగా టర్న్ అవుతుంది. ఈ సినిమా మానిపులేషన్ తో టెన్షన్ పెట్టిస్తుంటుంది. ఒక సైకిక్ అమ్మాయిని ప్రేమించడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఆతరువాత అదిరిపోయే ట్విస్ట్ లతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘పెట్’ (Pet) 2016లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం. కార్లెస్ టోరెన్స్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో డొమినిక్ మోనఘన్ (సెత్), క్సేనియా సోలో (హోలీ), జెన్నెట్ మెక్‌కర్డీ (క్లైర్), నాథన్ పార్సన్స్ (ఎరిక్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలై IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే

లాస్ ఏంజిల్స్‌లో సెత్ ఒక యానిమల్ షెల్టర్ కార్మికుడు. బస్సులో తన చిననాటి హైస్కూల్ విద్యార్ధి హోలీ అనే ఒక వెయిట్రెస్‌ను చూసి ఆమెపై మోహం పెంచుకుంటాడు. ఆమె సోషల్ మీడియాను స్టాక్ చేసి, ఆమె పనిచేసే కేఫ్‌కి వెళ్ళి డేట్‌కు ఆహ్వానిస్తాడు. కానీ హోలీ అందుకు తిరస్కరిస్తుంది. ఆ తరువాత హోలీ ఒక సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. ఆమెను సేవ్ చేయాలని, ఆమె చేసే హత్యలను ఆపాలని సెత్ నిర్ణయించుకుంటాడు. ఒక బేస్‌మెంట్‌లో ఒక కేజ్ నిర్మించి, హోలీని కిడ్నాప్ చేసి బంధిస్తాడు. మొదట ఈ చిత్రం సాధారణ స్టాకర్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. ఆతరువాత గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ మధ్యలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. హోలీ మొదటిగా హత్య చేసింది ఆమె స్నేహితురాలినే. ఆ తర్వాత హోలీ అనామకులను లక్ష్యంగా చేసుకుని హత్యలను చేసి ఆనందిస్తుంటుంది.

సెత్ దీనిని తెలుసుకుని, ఆమెకి ఉన్న ఈ సైకిక్ స్వభావనాన్ని కేజ్ ద్వారా అణచివేయాలని ప్లాన్ చేస్తాడు. హోలీ కూడా సెత్‌ను తనలాంటి కిల్లర్‌గా మార్చడానికి మానసికంగా ప్రేరేపిస్తుంది. అతన్ని ఆమె పట్ల ప్రేమను నిరూపించమని, ఒక వేళ ప్రేమ ఉంటే సెక్యూరిటీ గార్డ్ ను చంపమని చెప్తుంది. సెత్ గార్డ్‌ను చంపి, శరీరాన్ని కుక్కలకు తినిపించి, మిగిలిన భాగాలను కాల్చేస్తాడు. ఆతరువాత హోలీని సెత్‌ కేజ్ నుంచి విడుదల చేస్తాడు. అయితే హఠాతుగా ఈ సారి సెత్‌ను కేజ్‌లో బంధిస్తుంది. ఇప్పుడు ఆమె తనకి ఉన్న సైకిక్ లక్షణాలను అతనిపై తీర్చుకుంటుంది. మరి హోలీ నుంచి సెత్‌ బయటపడతాడా ? ఆమె చేతిలో బలవుతాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : రైతే కదా అనుకుంటే రప్పా రప్పా… ఒక్కొక్కడి దుమ్ముదులిపే రైతు బిడ్డ… ఇది కదా రివేంజ్ అంటే

Related News

OTT Movie : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని మరొకడితో… డైరెక్ట్ గా మొగుడికే చెప్పే ఇల్లాలు… అతనిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : ల్యాబ్ లో అమ్మాయిల అస్థి పంజరాలు… కపుల్ ను కలవనివ్వని దెయ్యం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్

OTT Movie : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : 2 ఓటీటీల్లోకి 105 కోట్ల రివేంజ్ డ్రామా… ఆ సీన్లు కూడా… ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాక్

Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!

Big Stories

×