E-Paper
Advertisement

Dhurandhar OTT:బాలీవుడ్ ను షేక్ చేసిన దురంధర్.. తెలుగులో ఏ ఓటీటిలో అంటే..?

Dhurandhar OTT:బాలీవుడ్ ను షేక్ చేసిన దురంధర్.. తెలుగులో ఏ ఓటీటిలో అంటే..?
Advertisement

Dhurandhar OTT:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో అందరినీ ఆకట్టుకొని.. ఇప్పుడు హీరోయిన్ గా అవతరించిన సారా అర్జున్ (Sara Arjun)హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ధురంధర్. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుస కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో ఒకటిగా నిలిచింది. ‘ఉరి’ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ఆదిత్యా ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఆర్.మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు

బాలీవుడ్ కి ఊపిరి పోసిన ధురంధర్ మూవీ..

ముఖ్యంగా 2025లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ మూవీస్ లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లేక వెలవెలబోయిన బాలీవుడ్ సినీ పరిశ్రమకి ఊపిరినిస్తూ.. ఊహించని కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కి వస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో విడుదలై సుమారుగా 45 రోజులకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ నార్త్ లో కొన్ని చోట్ల థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తుందా అనే అనుమానాలకు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ఫిక్స్ చేసింది చిత్ర బృందం.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన బ్లాక్ బాస్టర్ మూవీ..

Advertisement

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక అందులో భాగంగానే జనవరి 30వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపోతే హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఖాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు తర్వాత నిఘా సంస్థల కార్యకలాపాల కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే ఇందులో అక్షయ్ కన్నా విలన్ పాత్రలో అదరగొట్టేసారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలలో హీరో రణవీర్ సింగ్ ని మించి ఆయన తన అద్భుతమైన నటనను కనబరిచారు. వాస్తవానికి ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునను అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. మొత్తానికైతే అక్షయ్ కన్నా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పవచ్చు

ALSO READ:Varanasi: వారణాసి నుండి క్రేజీ అప్డేట్.. రూమర్స్ కి చెక్ పెడుతూ వీడియో రిలీజ్!

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×