E-Paper
Advertisement

Pawan Kalyan : చిరు డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..?

Pawan Kalyan : చిరు డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..?
Advertisement

Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? లేదా పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోతాడా అన్న సందేహం జనాల్లో కలుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంకో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరు? ఏ బ్యానర్ లో సినిమా రాబోతుంది..? ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం..

అనిల్ రావిపూడి- పవన్ కళ్యాణ్ మూవీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి.. ఈయన ఈమధ్య చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. అంతేకాదు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నాయి. అనిల్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. రీసెంట్ గా చిరంజీవితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాని చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇదిలా ఉండదా అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నాడని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా రాబోతుందని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

Also Read :శోభనం గదిని చూసి చక్రీ షాక్..చక్రిని వదిలివెల్లితుందా..? తండ్రి కోసం మహా కన్నీళ్లు..

పవన్ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.. 

అనిల్ రావిపూడి తో పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుందన్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ చర్చనీ అంశంగా మారాయి.. మాస్, యాక్షన్స్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన పవర్ స్టార్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు.. అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి అలాంటి స్టోరీలు సెట్ అవ్వవు. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవ్వాలన్న కోరిక లేదు. ముందు అనిల్ రావిపూడి ఎవరితో ఎలాంటి సినిమాలు తీయాలో తెలుసుకుంటే మంచిది అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ బయటికి రాలేదు. మరి దీనిపై అనిల్ రావిపూడి రియాక్ట్ అవుతారేమో చూడాలి.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడంలో పవన్ కళ్యాణ్ చురుగ్గా వ్యవహారిస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఇంకో సినిమా చేసే టైం ఆయనకు లేదన్న విషయం తెలిసిందే.. ఏది ఏమైనా అనిల్ రావిపూడి తో సినిమా అంటే మరో అత్తారింటికి దారేది స్టోరీలా ఉంటుందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×