E-Paper
Advertisement

Dhurandhar: మొత్తం 7 దేశాల్లో సత్తా చాటుతున్న ధురంధర్.. ఆ రికార్డ్స్ అన్నీ మాయం!

Dhurandhar: మొత్తం 7 దేశాల్లో సత్తా చాటుతున్న ధురంధర్.. ఆ రికార్డ్స్ అన్నీ మాయం!
Advertisement

Dhurandhar:రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో రూ. 1300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతీయ సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రమిది.

పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ ప్రభంజనం:

భారతీయ సినిమాలకు పాకిస్థాన్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది, కానీ ‘ధురంధర్’ అక్కడ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో షారుఖ్ ఖాన్ సినిమాలకు లేదా సల్మాన్ ఖాన్ చిత్రాలకు అక్కడ మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ సినిమా అక్కడ నంబర్-1 పొజిషన్‌లో ఉండటం విశేషం. పొరుగు దేశంలోని నెటిజన్లు కూడా ఈ స్పై థ్రిల్లర్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇక ఇతర భారతీయ చిత్రాల కంటే వేగంగా అక్కడ వ్యూయర్ షిప్ సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచిపోయింది. దీనితో రణ్‌వీర్ సింగ్ క్రేజ్ పాన్-ఇండియా నుండి పాన్-వరల్డ్ లెవల్‌కు చేరుకుందని చెప్పవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డులు:

Advertisement

జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించిన ‘ధురంధర్’, కేవలం మూడు రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ సాధించి అందరినీ షాక్‌కు గురిచేసింది. గతంలో భారీ వ్యూస్ సాధించిన రణబీర్ కపూర్ ‘యానిమల్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మరియు పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప-2’ రికార్డులను ఇది మట్టికరిపించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7 దేశాల్లో ఈ సినిమా టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఈ చిత్రంలోని ఇంటెన్స్ యాక్షన్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గ్లోబల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

భారీ కలెక్షన్లు:

థియేటర్లలో రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, డిజిటల్ వేదికపై కూడా కోట్లు కురిపిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్ మరియు నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఒక గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేశాయి. ఇక రికార్డులన్నీ మాయం చేస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రం, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిగమించడం ఖాయం. ఈ విజయం చూస్తుంటే మంచి కంటెంట్ ఉంటే భాషా, దేశ సరిహద్దులతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఇకపోతే ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్గా తొలిసారి నటించి తన నటనతో ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఇప్పుడు ఈ సినిమాతో ఊహించని పాపులారిటీకి దక్కించుకోవడమే కాకుండా ఇండియన్ మార్కెట్ వద్ద తన స్టామినా చూపించింది. ప్రస్తుతం మెగా 158 మూవీలో చిరంజీవి కూతురుగా నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

Advertisement

ALSO READ:Lenin: అఖిల్ లెనిన్ వాయిదా పడనుందా.. ఆ మూవీ దెబ్బకు తప్పని తిప్పలు!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×