E-Paper
Advertisement

Fire Accident: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన గర్ల్స్ హాస్టల్.. సీసీటీవీ ఫుటేజ్

Fire Accident: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన గర్ల్స్ హాస్టల్.. సీసీటీవీ ఫుటేజ్
Advertisement

Fire Accident: హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక ‘సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్’ హాస్టల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.

తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న అమ్మాయిలు
అయితే ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్‌లో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, హాస్టల్‌లో మంటలు వేగంగా వ్యాపించి భవనం నుండి భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక శాఖ (హైడ్రా) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో హాస్టల్‌లోని ఫర్నిచర్, దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మంటలు పక్కన ఉన్న భవనాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.

Also Read: బీజాపూర్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ కమాండర్ ఉదయ్ సింగ్ హతం

Advertisement

పోలీసుల దర్యాప్తు..

అయితే ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ యజమాన్యం నుండి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అసలు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా.. లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×