E-Paper
Advertisement

Lenin: అఖిల్ లెనిన్ వాయిదా పడనుందా.. ఆ మూవీ దెబ్బకు తప్పని తిప్పలు!

Lenin: అఖిల్ లెనిన్ వాయిదా పడనుందా.. ఆ మూవీ దెబ్బకు తప్పని తిప్పలు!
Advertisement

Lenin:అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) కెరీర్ చూస్తుంటే అభిమానులకు ఒకటే టెన్షన్. ఆయన సినిమా మొదలవ్వడమే ఆలస్యం, మొదలయ్యాక వాయిదాల పర్వం తప్పడం లేదు. తాజాగా అఖిల్ హీరోగా, నిర్మాత నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న “లెనిన్” చిత్రం కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న లెనిన్ ఏప్రిల్ రేసులో నిలవాలనుకున్నా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురవ్వడంతో, వెనక్కి తగ్గడమే మేలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. వివరాలలోకి వెళితే ..

అడ్డంకుల మీద అడ్డంకులు:

నిజానికి ‘లెనిన్’ ప్రాజెక్ట్ ఏడాది క్రితమే మొదలైనప్పటికీ, మధ్యలో రకరకాల కారణాలతో షూటింగ్ ఆగిపోయింది. మొదట హీరోయిన్‌గా అనుకున్న శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత అఖిల్ తన పెళ్లి పనుల కోసం విరామం తీసుకోవడంతో సినిమా ఆలస్యమైంది. తాజాగా భాగ్యశ్రీ బోర్సేను కథానాయికగా తీసుకుని మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే, నిర్మాత నాగవంశీ సినిమాలకు వాయిదాలు పడటం వెరీ కామన్ అనే ముద్ర ఉండటంతో, లెనిన్ కూడా అదే బాటలో పయనిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏప్రిల్ బాక్సాఫీస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్:

Advertisement

ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఏప్రిల్ నెల సినిమాలతో కిక్కిరిసిపోయింది. ఏప్రిల్ 3న ‘బైకర్’, ఏప్రిల్ 10న అడివి శేష్ ‘డెకాయిట్’ , ‘స్వయంభు’ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 30న ‘పెద్ది’ భారీ ఎత్తున వస్తోంది. రామ్ చరణ్ పెద్ది మూవీ పైన భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటికే రిలీజ్ అయినా పాట, గ్లింప్స్ కు అనుహ్య స్పందన వచ్చింది. ఇక అఖిల్ కు మధ్యలో ఏప్రిల్ నెలలోమిగిలిన రోజులు ఖాళీగా ఉన్నా, వచ్చే చిత్రాల ధాటికి థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. ఇంతమంది పోటీలో నలిగిపోవడం కంటే, సేఫ్ సైడ్ ఉండటానికి సినిమాను వాయిదా వేయడమే ఉత్తమమని టీం ఆలోచిస్తున్నట్లు టాక్.

ALSO READ:Chandrahas: చంద్రహాస్ పాట వివాదం.. శంబాల హీరో ఊహించని రియాక్షన్!

ఫ్యాన్స్ ఆశలు:

Advertisement

అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు అక్కినేని ఫాన్స్. ఇప్పటికే ‘ఏజెంట్’ ఫలితంతో డీలా పడ్డ అక్కినేని ఫ్యాన్స్‌కు ‘లెనిన్’ రూపంలో ఒక సాలిడ్ హిట్ కావాలి. కానీ వాయిదాల పర్వం ఇలాగే కొనసాగితే సినిమా క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి నాగవంశీ టీమ్ ఈ సవాళ్లను అధిగమించి ఏప్రిల్‌లోనే వస్తుందా లేక సమ్మర్ లాస్ట్ డేట్స్ కు వెళ్తుందో చూడాలి. ఏదేమైనా అఖిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×