E-Paper
Advertisement

Bigg Boss 9 Winner: టైటిల్‌ విన్నర్‌ తనూజ?.. ప్రొమోలో హింట్‌ ఇచ్చేసిన నాగార్జున

Bigg Boss 9 Winner: టైటిల్‌ విన్నర్‌ తనూజ?.. ప్రొమోలో హింట్‌ ఇచ్చేసిన నాగార్జున
Advertisement

Thanuja Won Bigg Boss 9 Title: మరికొద్ది గంటల్లో బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే టెలికాస్ట్‌ కాబోతుంది. ప్రస్తుతం ఈ ఫీనాలే ఎపిసోడ్‌ జరుగుతుంది. ఇప్పటికే టాప్‌ 5 ఫైనలిస్టులో ముగ్గురు హౌజ్‌ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హౌజ్‌లో టాప్‌ 2 ఫైనలిస్టులు ఉన్నారు. వారే తనూజ పుట్టస్వామి, కళ్యాణ్‌ పడాల. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రణరంగం మొదలైంది. మంచి స్నేహితులై వీరి టైటిల్ పోరు పడటం ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్‌లో వీరిద్దరు నువ్వా–నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.

టాప్ 3లో డిమోన్ అవుట్

Advertisement

ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ కూడా తమ ఫేవరేట్‌ కంటెస్టెంట్‌ గెలిపించుకునేందకు పోటా పోటికి ఓట్లేశారు. ఓటింగ్‌లో తనూజ, కళ్యాణ్‌ల మధ్య గట్టి పోరు జరిగింది. టాప్‌ 3లో ఉన్న డిమోన్‌ పవన్‌ రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో కాసేపటి క్రితమే హౌజ్ నుంచి బయటకు వచ్చాడట. అయితే ఏ సీజన్‌ చూసి కొద్ది వారాలకే విన్నర్‌ ఎవరన్నదని స్పష్టత వచ్చేస్తోంది. కానీ, ఈ సీజన్‌లో టైటిల్‌ విన్నర్‌ ఎవరో చెప్పడం ఆడియన్స్‌ పజిల్‌గా మారింది. కొన్ని రోజుల వరకు తనూజ అన్నారు.. ఆ తర్వాత కళ్యాణ్‌ పడాల విన్నర్ అంటూ చర్చ మొదలైంది. దీంతో బిగ్‌బాస్‌ తెలుగు 9 సీజన్‌ టైటిల్‌ విన్నర్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇక చివరి వరకు విన్నర్‌ ఎవరనేది సస్పెన్స్‌ గా మారింది.

కొత్త చరిత్ర అంటూ నాగ్ హింట్

ఈ నేపథ్యంలో కాసేటి క్రితం విడుదలైన ప్రొమో చూసి కొందరు విన్నర్‌ ఎవరనేది అంచన వేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున చివరిలో చెప్పిన మాటల ప్రకారం చూస్తే.. ఈ సీజన్‌ విన్నర్‌ తనూజ అని అంత ఫిక్స్‌ అవుతున్నారు. 105 రోజుల రణరంగం చివరి అంకానికి చేరుకుంది.. ఈరోజు ముగింపు అద్భుతంగా ఉండబోతుందని నాగ్‌ డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. అన్నట్టుగా ప్రోమో అంత చాలా సరదాగా ఆసక్తిగా సాగింది. ఇక చివరిలో ఈ యుద్ధ భూమిలో ఆ ట్రోఫీ ఎవరి సొంతం కాబోతుందో ఈ రాత్రికి చూద్దాం.. ఈ రాత్రి నిర్ణయిస్తుంది సరికొత్త విన్నర్‌ని.. ఒక కొత్త చరిత్రని అని అన్నారు. ఎప్పుడు లేనట్టుగా బిగ్‌బాస్‌ ఫినాలే కొత్త చరిత్ర అంటూ సంభాషించడం చూసి అందరిలో క్యూరియాసిటి నెలకొంది. 

Advertisement

Also Read: Bigg Boss 9 Finale: రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో డిమోన్‌ బయటకు.. ఇక టాప్‌2 వీరిద్దరే!

టైటిల్ తనూజదేనా?

బిగ్‌ బాస్‌లో కొత్త చరిత్ర అంటే లేడీ విన్నరే అని చెప్పాలి. ఇదివరకు బిగ్‌ బాస్‌లో లేడీ కంటెస్టెంట్‌ విన్నర్‌ అయ్యింది లేదు. ఈ సీజన్‌లో మొదటి నుంచి తనూజ గెలిచేందుకు కూడా అవకాశాలు ఎక్కువ కనిపించాయి. తాజా ప్రొమోలో నాగార్జున బిగ్‌బాస్‌ కొత్త చరిత్ర చూడబోతున్నారంటూ ఇలా తనూజ విన్నర్‌ హింట్‌ ఇచ్చేశాడంటున్నారు. అటూ సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం.. ఇటూ నాగ్‌ మాటల ప్రకారం చూస్తే.. బిగ్‌ బాస్‌ 9 తెలుగు సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ తనూజనే అనిపిస్తోంది. మరోవైపు వికిపిడియా కూడా తనూజనే విన్నర్‌ అని పేర్కొంది. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌కి కొత్త చరిత్ర అవుతుంది. కాగా బిగ్‌ బాస్‌ ఓటీటీ టైటిల్‌ నటి బిందు మాధవి గెలిచిన సంగతి తెలిసిందే.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×