E-Paper
Advertisement

Disaster drama ott : సలసలా మరిగే సముద్రం… స్విమ్మింగ్ కెళ్ళి ఉడికిపోయే అమ్మాయి… గుండె గల్లంతయ్యే సీన్లు

Disaster drama ott : సలసలా మరిగే సముద్రం… స్విమ్మింగ్ కెళ్ళి ఉడికిపోయే అమ్మాయి… గుండె గల్లంతయ్యే సీన్లు
Advertisement

Disaster drama ott : విపత్తులతో వచ్చే కొన్ని స్టోరీలు భయంకరమైన సీన్స్ తో ఆడియన్స్ ని కంగారు పెడుతుంటాయి. ఇక సునామీ లాంటి కథలను కదలకుండా చూస్తుంటారుఆడియన్స్. ఇవి సృష్టించే బీభత్సం అంతా ఇంతా ఉండదు. మొత్తం తుడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ స్టోరీ కూడా అలాంటిదే. స్పానిష్ ద్వీపమైన లా పాల్మాలో అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడే సునామీ ముప్పును, దాని నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి పర్యాటకులు చేసే ప్రయత్నాలను ఈ సిరీస్ చూపిస్తుంది. దీని పేరు ఏమిటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘లా పాల్మా’ (La Palma) మినీ సిరీస్‌కు కాస్పర్ బార్‌ఫోడ్ దర్శకత్వం వహించారు. ఇందులో థియా సోఫీ లోచ్ నాస్, ఇంగ్రిడ్ బోల్సో బెర్డల్ మరియు ఆండర్స్ బాస్మో క్రిస్టియన్సెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాస్పర్ గతంలో నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ ‘ద నర్స్’కు కూడా దర్శకత్వం వహించారు. నాలుగు ఎపిసోడ్స్ ఉన్న ఈ మినీ సిరీస్ చూపు తిప్పుకోనివ్వదు. ఒక భయాంకరమైన ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు.

Advertisement

Read Also : 25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

స్టోరీ ఏమిటంటే

నార్వేకు చెందిన జెన్నిఫర్, ఆమె భర్త ఫ్రెడరిక్ తమ ఇద్దరు పిల్లలు సారా, టోబియాస్‌లతో కలిసి క్రిస్మస్ సెలవుల కోసం స్పెయిన్‌లోని లా పాల్మా ద్వీపానికి వస్తారు. అదే సమయంలో, మారియా అనే అగ్నిపర్వత పరిశోధకురాలు, అదే ద్వీపంలోని కుంబ్రే వియెజా అగ్నిపర్వతంలో ప్రమాదకరమైన కదలికలను గుర్తిస్తుంది. ఒకవేళ ఈ అగ్నిపర్వతం పేలితే, కొండలోని ఒక భారీ భాగం సముద్రంలో పడి ప్రపంచంలోనే అతిపెద్ద సునామీ వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరిస్తుంది.

Advertisement

మారియా హెచ్చరికలను అధికారులు మొదట సీరియస్‌గా తీసుకోరు. పర్యాటక రంగం దెబ్బతింటుందనే భయంతో ద్వీపాన్ని ఖాళీ చేయించడానికి నిరాకరిస్తారు. కానీ పరిస్థితులు వేగంగా మారుతాయి. భూకంపాలు మొదలవ్వడంతో జనం భయాందోళనలకు గురవుతారు. జెన్నిఫర్ కుటుంబం విడిపోతుంది. సారా తన స్నేహితుడితో కలిసి విమానంలో తప్పించుకోవాలని చూస్తుంది. జెన్నిఫర్ టోబియాస్ విమానాశ్రయంలో చిక్కుకుపోతారు. ఫ్రెడరిక్ వారిని వెతుకుతూ విడిపోతాడు. చివరికి అక్కడ సునామీ వస్తుందా ? జెన్నిఫర్ ఫ్యామిలీ ఈ ప్రమాదం నుంచి బయట పడుతుందా ? అనేది ఈ మినీ సిరీస్‌ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×