E-Paper
Advertisement

Road Accident: భోగి పండుగ వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంని ఢీ కొట్టిన ఆర్టీసీ

Road Accident: భోగి పండుగ వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంని ఢీ కొట్టిన ఆర్టీసీ
Advertisement

Road Accident: సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వెళుతుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  హైదరాబాదు నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎంని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం 44 వ జాతీయ రహదారిపై మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1.30 గంటలకు హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది.

Advertisement

ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాల య్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్‌ అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స తీసుకుంటున్నారు.

డీసీఎంని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఈ ప్రమాదం నేపథ్యంలో కిలోమీటర్ల మేరవాహనాలు నిలిచిపోయాయి. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  వాహనాలు ఘటన ప్రాంతంలో నెమ్మదిగా వెళ్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  వాహనాల డ్రైవర్లతో మాట్లాడారు. అలాగే ప్రయాణికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.  ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ALSO READ:  కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలెండర్లు

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×