E-Paper
Advertisement

OTT Movie : తండ్రి పోలీస్ కొడుకు దొంగ … ఒక్కో సీన్ అరాచకం … మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

OTT Movie : తండ్రి పోలీస్ కొడుకు దొంగ … ఒక్కో సీన్ అరాచకం … మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
Advertisement

OTT Movie : డ్రగ్స్ అడిక్షన్, క్రైమ్, ఫాదర్-సన్ రిలేషన్‌షిప్ తో ఒక సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఇది ఒక అండర్‌వరల్డ్ చుట్టూ తిరుగుతుంది. బ్రెజిలియన్ అవార్డ్స్‌లో బెస్ట్ సిరీస్ ను గెలిచి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ పెడ్రో డామ్ అనే రియల్ గ్యాంగ్‌స్టర్ లైఫ్ ఆధారంగా తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి పోలీస్ గా ఉంటే, కొడుకు డ్రగ్స్ తో పాటు, దొంగతనాలు కూడా చేస్తుంటాడు. వీళ్ళ మధ్య సాగే స్టోరీ చూపు తిప్పుకొనివ్వదు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ బ్రెజిలియన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘Dom’. 2021నుంచి 2024 మధ్య మొత్తం మూడు సీజన్లు వచ్చాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన మొదటి ఒరిజినల్ సిరీస్ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. బ్రెనో సిల్వెరా రూపొందించిన ఈ సిరీస్ ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది. ఇందులో గేబ్రియెల్ లియోన్ (పెడ్రో డామ్), ఫ్లావియో టోలెజాని (విక్టర్ డాంటాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. మూడు సీజన్లు (ప్రతి సీజన్ 8 ఎపిసోడ్‌లు) విడుదలై ఫైనల్ సీజన్‌తో ముగిసింది. ఇది బ్రెజిలియన్ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ సిరీస్ వంటి ప్రధాన అవార్డులు గెలిచింది. మొత్తం 17 నామినేషన్లు వచ్చాయి.

Advertisement

Read Also : అడవిలో అంతుచిక్కని రహస్యాలు… ట్రైబల్స్ తో సిటీ అమ్మాయి వింత పనులు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఈ సిరీస్ రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. 2000లలో పెడ్రో డామ్ జీవితం, 1970-80లలో అతని తండ్రి విక్టర్ డాంటాస్ జీవితం. విక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాడు. విక్టర్ పోలీస్ ఇంటెలిజెన్స్‌లో జాయిన్ అవుతాడు. అండర్‌కవర్‌గా ఫావెలాల్లోకి వెళ్లి డ్రగ్ కార్టెల్స్‌ను బయటపెడుతాడు. మిలిటరీ డిక్టేటర్‌షిప్ కాలంలో కరప్షన్, వెపన్స్ డీలింగ్ చూపిస్తారు. ప్రెజెంట్ టైమ్‌లో పెడ్రో మిడిల్ క్లాస్ బాయ్ నుంచి కొకైన్ అడిక్ట్ అవుతాడు. డబ్బున్న వాళ్ళను దోచుకుని ఫేమస్ అవుతాడు. తండ్రి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంటే, కొడుకు డ్రగ్స్, క్రైమ్‌లో మునిగిపోతాడు. విక్టర్ కొడుకును రక్షించడానికి ఏం చేయాలన్నా చేస్తాడు. ఫ్యామిలీ బాండ్ బలంగా ఉంటుంది. సీజన్ 1లో పెడ్రో గ్యాంగ్ లీడర్ అవుతాడు, సీజన్ 2లో రాబరీస్, జైలు ఎస్కేప్, సీజన్ 3 లో ఫైనల్‌గా ట్రాజిక్ ఎండింగ్ ఉంటుంది. ఈ సిరిస్ రియల్ లైఫ్ పెడ్రో డామ్ స్టోరీ ఆధారంగా, డ్రగ్స్ వార్, ఫాదర్-సన్ కాన్ఫ్లిక్ట్ ఇంటెన్స్‌గా చూపిస్తారు.

Advertisement

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×