E-Paper
Advertisement

OTT Movie : అడవిలో అంతుచిక్కని రహస్యాలు… ట్రైబల్స్ తో సిటీ అమ్మాయి వింత పనులు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : అడవిలో అంతుచిక్కని రహస్యాలు… ట్రైబల్స్ తో సిటీ అమ్మాయి వింత పనులు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఎప్పటికైనా మానవుల వల్ల ప్రకృతి పూర్తిగా నాశనం అవుతుంది. మానవాళి అంతం కూడా అప్పుడే ఆరంభం అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటి డిఫరెంట్ కంటెంట్ తో వణుకు పుట్టిస్తోంది. ఈ స్టోరీ మానవుల విధ్వంసానికి, ప్రకృతి ప్రతీకారం తీర్చుకునే విధంగా, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో సాగుతుంది. సౌత్ ఆఫ్రికాలోని ట్సిట్సికమ్మా ఫారెస్ట్‌లో షూటింగ్ జరిగిన ఈ మూవీ ప్రకృతి మానవులపై ప్రతీకారం తీర్చుకునే థీమ్‌తో వచ్చింది. ఫంగస్ ఇన్ఫెక్షన్, బాడీ హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో పలు అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో వచ్చిన ఈ సౌత్ ఆఫ్రికన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Gaia’. జాకో బౌవర్ తన మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా దీనిని తీశారు. ఈ సినిమాలో మోనిక్ రాక్‌మ్యాన్, కారెల్ నెల్, అలెక్స్ వాన్ డైక్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా Hulu, Amazon Prime Video, Apple TV, Tubi లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : సైకో గ్యాంగ్ అరాచకం… థియేటర్ల నుంచి పరుగులు పెట్టిన జనం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

స్టోరీ ఏమిటంటే

గాబీ అనే ఒక ఫారెస్ట్ రేంజర్, తన సహోద్యోగి విన్‌స్టన్ తో కలిసి ఒక మారుమూల అడవిలో నిఘా మిషన్‌లో ఉంటుంది. అయితే ఆమె డ్రోన్ నియంత్రణ కోల్పోయి ఎక్కడో పడిపోతుంది. గాబీ దాన్ని వెతకడానికి దట్టమైన అడవిలోకి వెళుతుంది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కూడా అవుతాయి. అడవిలో ఒంటరిగా చిక్కుకుపోయిన ఆమెకు, బారెండ్ అనే ఒక తండ్రి, అతని కొడుకు స్టీఫన్ తారసపడతారు. వీళ్ళు ఆధునిక ప్రపంచానికి దూరంగా, అడవిలో వేటాడుతూ జీవిస్తుంటారు. బారెండ్ అడవి పట్ల ఒక వింత ఆచారాన్ని పాటిస్తుంటాడు. మొదట సహాయంగా అనిపించిన ఈ కలయిక, త్వరలోనే మరింత భయంకరంగా మారుతుంది.

Advertisement

ఆ తండ్రీకొడుకులు ఆ అడవిలో నివసించే ఒక పురాతన ‘గైయా’ అనే జీవిని ఆరాధిస్తున్నారని గాబీకి తెలుస్తుంది. అడవిలో ఒక పెద్ద ముప్పు ఉందని, గాబీ అర్థం చేసుకుంటుంది. గాబీ ఆ ప్రదేశం నుండి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇప్పడు స్టోరీ మరింత భయానకంగా మారుతుంది. అసలు ఆ అడవిలో ఎలాంటి శక్తి ఉంది ? దాని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ? గాబీ అక్కడి నుంచి బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×