BigTV English

Unstoppable with NBK S4 : బాలయ్య షోకు మలయాళ స్టార్ హీరో..!

Unstoppable with NBK S4 : బాలయ్య షోకు మలయాళ స్టార్ హీరో..!

Unstoppable with NBK S4 : బాలయ్య హోస్ట్ గా చేస్తున్న సూపర్ హిట్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే.. ఈ షో మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రసారం అవుతుంది.. ఈ సీజన్ మొదటి షోకు ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 25 న షోను స్ట్రీమింగ్ చేశారు. ఏపీ సీఎం రాజకీయ పరిస్థితుల గురించి చెప్పారు. ఇక ఆ ఎపిసోడ్ తర్వాత హీరో సూర్య కంగువ ప్రమోషన్స్ కోసం వెళ్లారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో హౌస్ లో సందడి చేయబోతున్నాడని సమాచారం.. ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆహా లో ప్రసారం అవుతున్న సక్సెస్ ఫుల్ షో అన్ స్టాపబుల్ విత్ బాలయ్య.. ఈ షో లో బాలయ్య ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. సినిమాల్లో రఫ్ గా కనిపించే బాలయ్య లో ఇలాంటి యాంగిల్ ఒకటి ఉందా అని ఆశ్చర్య పోతున్నారు. హీరోలతో ఆయన అడిగే ప్రశ్నలు కౌంటర్లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరితో చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ షోలో మళయాళ హీరో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన మూవీ ప్రమోషన్స్ కోసం ఈ షోలో సందడి చేయబోతున్నాడని ఓ వార్త షికారు చేస్తుంది.

ఇక రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అతిథిగా వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్‌. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌  మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ నిర్మించాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన సినిమా ప్రమోషన్స్ కోసం దుల్కర్ ఈ షోకు రాబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఆయనతో పాటు లక్కీభాస్కర్ టీమ్ హాజరైందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూరైనట్లు సమాచారం. ఇక బాలయ్య తనదైన శైలిలో పలు ప్రశ్నలు అడిగారట. దుల్కర్ ఎలాంటి సమాధానాలు చెప్పాడు. బాలయ్య ఏ ఏ ప్రశ్నలు అడిగారో తెలుసుకునేందుకు రెండో ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆ షో స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందో ఆహా టీమ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారని సమాచారం.. ఇక ఈ షోకు పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కూడా వచ్చినట్లు తెలుసు.. ఆ టీమ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ ఎన్నో కీలక విషయాల గురించి చర్చించారని టాక్.. ఈ ఎపిసోడ్ కోసం బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది..


Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×