E-Paper
Advertisement

అంతరిక్ష నౌకలో అనుకోని అతిథి అరాచకం… మనుషుల్ని తినే మాయా జీవుల రచ్చ

అంతరిక్ష నౌకలో అనుకోని అతిథి అరాచకం… మనుషుల్ని తినే మాయా జీవుల రచ్చ
Advertisement

Horror Movie OTT : సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. వీటిని చూస్తున్న కొద్ది చూపు పక్కకు తిప్పుకోలేం. ఓ పక్క భయపెడుతున్నా, ఆ విజువల్స్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, అంతరిక్షంలో ఒక దెయ్యాల కొంప లాంటి స్పేస్ షిప్ లో జరుగుతుంది. మామూలుగా స్పేస్ సినిమాలు అంటే గ్రహాంతరవాసులు, రాకెట్లు ఉంటాయని అనుకుంటాం కానీ, ఇందులో అవేమీ ఉండవు. ఒక పెద్ద షిప్ పొరపాటున నరకం లాంటి ప్లేస్ లోకి వెళ్లి రావడంతో దానికి దెయ్యం పడుతుంది. ఆ షిప్‌లోకి వెళ్లినోళ్లకి లేనిపోనివన్నీ కనిపిస్తూ, ఒకరినొకరు చంపుకునేలా పిచ్చి లేపుతుంది. సైన్స్ ఫిక్షన్ కథకి పక్కా నాటు హారర్ టచ్ ఇచ్చి, రక్తం ఏరులై పారేలా తీసిన హారర్ థ్రిల్లర్ ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడచ్చు అంటే ?

ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ పేరు ‘ఈవెంట్ హారిజన్’ (event horizon 1997).ఈ సినిమా 1997లో విడుదలైన సమయంలో ఆశించిన విజయం సాధించకపోయినా, కాలక్రమేణా ఒక ‘కల్ట్ క్లాసిక్’గా గుర్తింపు పొందింది. ఇందులో లారెన్స్ ఫిష్‌బర్న్, సామ్ నీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సినిమాలోని ‘గ్రావిటీ డ్రైవ్’ సెట్‌ను అప్పట్లో అత్యంత ఖరీదైనదిగా ఉండేవి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ‘డెడ్ స్పేస్’ (Dead Space) వంటి పాపులర్ వీడియో గేమ్‌లకు, అనేక ఇతర స్పేస్ హారర్ సినిమాలకు ఇది ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు ‘టైటానిక్’ సినిమా విడుదల ఆలస్యం కావడంతో, ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఈ సినిమాను హడావిడిగా విడుదల చేయించారు. ఆ తొందరపాటు వల్లే ఎడిటింగ్‌లో చాలా ముఖ్యమైన సీన్లు కోల్పోవాల్సి వచ్చిందని చిత్ర బృందం ఇప్పటికీ బాధపడుతుంటుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

2047వ సంవత్సరంలో, ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ‘ఈవెంట్ హారిజన్’ అనే స్పేస్ షిప్ మళ్లీ కనిపిస్తుంది. అది నెప్ట్యూన్ గ్రహం సమీపంలో ఉన్నట్లు తెలుసుకుంటారు. ఆ నౌక ఎలా తిరిగి వచ్చిందో తెలుసుకోవడానికి కెప్టెన్ మిల్లర్ తన టీమ్ తో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ నౌకను తయారు చేసిన శాస్త్రవేత్త డాక్టర్ వీర్ కూడా వాళ్ళ వెంటే ఉంటాడు. అయితే ఆ నౌక లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అసలు ఆ నౌకలో అమర్చిన ఒక ప్రత్యేకమైన యంత్రం వల్ల అది విశ్వం అవతలి అంచులకు, అంటే ఒక రకమైన ‘నరకం’ లాంటి చోటికి వెళ్లి వచ్చిందని వాళ్ళకి అర్థమవుతుంది.

also read : సిటీ పిల్ల పల్లెటూరికి… మనసుకు ప్రశాంతతను ఇచ్చే కొరియన్ లవ్ స్టోరీ

Advertisement

అక్కడి నుండి అది ఒక దుష్ట శక్తిని తనతో తెచ్చుకుంటుంది. ఆ శక్తి వల్ల నౌకలో ఉన్న వాళ్ళకి భయంకరమైన భ్రమలు కలుగుతుంటాయి. వాళ్ళ మనసులోని వెళ్ళి ఆ నౌక హింసించడం మొదలుపెడుతుంది. చివరకు ఆ నౌకను తయారు చేసిన డాక్టర్ వీర్ కూడా ఆ దుష్టశక్తి ప్రభావానికి లోనై వికృతంగా మారిపోతాడు. మిగిలిన వాళ్ళను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇక చివరగా కెప్టెన్ మిల్లర్ తన ప్రాణాలను పణంగా పెట్టి, ఆ నౌకలోని ఒక భాగాన్ని పేల్చేసి తన టీమ్‌లో కొందరిని కాపాడతాడు. సైన్స్ ఫిక్షన్ కథకు హారర్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను చాలా భయంకరంగా తెరకెక్కించారు.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×