BigTV English
Advertisement

Thriller Movie In OTT :  సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులు ఎన్నో…

Thriller Movie In OTT :  సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులు ఎన్నో…

Thriller Movie In OTT : ఇటీవల థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా కూడా ఓటీటీలో కొత్త కొత్త కథలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో మిస్ అయ్యిన సినిమాలను ఓటీటీలోకి చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారు. అదే విధంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తారు.. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వారానికి 20 పైగా సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ మూవీలకు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువే. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ ఏంటి స్ట్రీమింగ్ ఎక్కడ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ ఏడాది మలయాళ సినిమా ఇండస్ట్రీ పంట పండింది. థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకున్నాయి. మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బౌగెన్‌విలియా.. అక్టోబర్ 17న రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర రూ.35 కోట్లు వసూలయ్యాయి. రుచింతె లోకం అనే నవల నుంచి స్ఫూర్తి పొంది ఈ బౌగెన్‌విలియా మూవీని తెరకెక్కించారు.. ఈ థియేటర్లలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు సినీ లవర్స్ కు ఈ మూవీని అందుబాటులోకి ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలివ్ డిసెంబర్ 13 న ఓటీటీలోకి తీసుకొని రాబోతున్నట్లు నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రకటించారు.

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. మలయాళ విలక్షణ నటుడు ఫాహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ భారీ విషయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన మూవీనే ఇది. రాయ్స్, రీతూ అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వాళ్ల జీవితం ఓ పెద్ద ప్రమాదంతో మలుపు తిరుగుతుంది. ఆ ప్రమాదంలో రీతూ తన జ్ఞాపకశక్తి కోల్పోతుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ కేసులో ఇరుక్కుంటుంది. కేరళలో ఊహించని విధంగా కనిపించకుండా పోతారు. ఆమెనే ఆ కిడ్నాప్ లను చేస్తుందని అందరు అనుకుంటారు. కానీ తన భర్త ఆ కేసు నుంచి ఎలా కాపాడుకుంటాడో అన్నది స్టోరీ. మిస్టరీ, సస్పెన్స్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ల సినిమాలను తెరకెక్కించడంలో మలయాళం ఇండస్ట్రీ మేకర్స్ చాలా ముందుంటారు. సింపుల్ స్టోరీలను ఊహించని ట్విస్టులతో అందించడం వాళ్లకు అలవాటు. ఈ బౌగెన్‌విలియా కూడా అలాంటి సినిమానే.. తెలుగు ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..


Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×