Bhuma Mounika : గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీస్ లో ఆస్తి వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అసలు ఇది ఎక్కడికి మొదలైంది ఏంటి అనే క్లారిటీ ఇప్పటివరకు ఎవరికీ లేదు. వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ గురించి పదిమంది పది రకాలుగా చెబుతూ వస్తున్నారు. ఎవరికి నచ్చిన వెర్షన్ వాళ్ళు వివరిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికే క్లారిటీ లేదు. రెండేళ్ల క్రితం విష్ణు మంచు మనోజ్ ని ఇంటికొచ్చి కొట్టాడు అనే వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే కొన్ని రోజుల తర్వాత అది ఒక రియాలిటీ షో అంటూ షో చేశారు. వాస్తవానికి నిజంగా జరిగిన వీడియోని అలా కవర్ చేశారు అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఇకపోతే గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం ఇది ఆస్తి వివాదాల కోసమే జరుగుతుంది అని చాలామంది చెప్పడంతో పాటు కథనాలు కూడా వచ్చాయి.
మొదట మంచు మనోజ్ మంచు మోహన్ బాబు సిబ్బందిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మోహన్ బాబు పై మనోజ్ దాడి చేశాడు అంటూ మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వడం ఇస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ వాస్తవాలు కాదు అని మోహన్ బాబు పి.ఆర్ టీం కన్ఫామ్ చేసింది. కానీ సాయంత్రానికి ఇవన్నీ వాస్తవాలు అని తెలిసింది. బహిరంగంగా ఇద్దరు కంప్లైంట్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా విష్ణు కూడా దుబాయ్ నుంచి వచ్చేసి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా విష్ణుకు సంబంధించిన సిబ్బందిని ఈరోజు హౌస్ లో ఎంట్రీ చేసి మనోజ్ కి సంబంధించిన సిబ్బందిని హౌస్ నుంచి గెంటేసినట్లు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ తరుణంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Game Changer: మరో 30 రోజుల్లో గేమ్ చేంజర్, నెక్స్ట్ లెవెల్ పోస్టర్ రిలీజ్
మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పోలీసులతో ఫోన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ముందు మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు మీరు మనోజ్ వైపు యాక్షన్ తీసుకోవాలి మీరు ఒక వైపే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని మౌనిక మాట్లాడిన మాటలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇదే విషయాన్ని మనోజ్ కూడా తెలిపాడు. పోలీసులు కూడా ఏకపక్షంగా నడుస్తున్నారు అంటూ మీడియాతో తెలిపాడు. అంతేకాకుండా లకిడికపూల్ లో ఉన్న డిజిపి ఆఫీస్ కి బయలుదేరి స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్. మరోవైపు మౌనిక కూడా ఒక్కొక్కరి మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాను అంటూ వీడియోలో పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడినట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది.
నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను: మంచు మౌనిక#BhumaMounika #ManchuManoj #TeluguNews #Swetchdailyepaper pic.twitter.com/4D7RjgsLx5
— Swetcha Daily (@swetchadaily) December 10, 2024