Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటించింది. ఇక ఎన్నో అంచనాల నడుమ పుష్ప 2 డిసెంబర్ 4 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అక్కడక్కడ మిక్స్డ్ టాక్ ను అందుకున్నా.. కలక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో సుమారు 12,500 స్క్రీన్లలో రిలీజ్ అయిన పుష్ప 2.. ఐదు రోజుల్లో రూ. 900 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు.
మరో మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 1000 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక పుష్ప 2 తో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. పుష్ప నుంచి పుష్ప 2 వరకు మధ్యలో ఇంకో సినిమా చేయలేదు. పుష్ప రాజ్ పాత్ర కోసమే గడ్డం, జుట్టు పెంచుతూ వచ్చాడు. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం బన్నీ కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలంగా ఫ్యాన్స్ ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించారు. అయితే.. పుష్ప 2 పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
Manchu Manoj Wife Mounika: మీరు న్యాయంగా చెయ్యండి… దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయ్
సినిమాలో కథ లేదని.. ఎటు నుంచి ఎటు పోతుందో అర్ధమే కాలేదని చెప్పుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదని, సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ జాతర సీన్, క్లైమాక్స్ కొద్దిగా బావున్నాయని పెదవి విరుస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నటన మాత్రం వేరే లెవెల్ అని, బన్నీ యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. పుష్ప 2 కోసం బన్నీ రూ. 300 కోట్లు తీసుకున్నాడని టాక్ నడిచింది. అయితే అందులో నిజం లేదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారట.
ఈ మధ్యకాలంలో హీరోలు.. రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వచ్చే షేర్ తీసుకుంటున్నారు. పుష్ప 2 బడ్జెట్ ఎక్కువ కావడంతో బన్నీ కూడా రెమ్యూనరేషన్ కాకుండా వచ్చిన లాభాల్లో వాటా అడిగినట్లు సమాచారం. అంటే .. సినిమా మొత్తం కలక్షన్స్ రాబట్టాకా. అందులో 40శాతం షేర్స్ అల్లు అర్జున్ ఖాతాలోకి వెళ్లనున్నాయట. ఇక ఈ రికార్డుల వేట చూస్తుంటే.. ఇంకో వారం, పది రోజుల్లో పుష్ప 2.. ఎంత లేదన్నా.. రూ .1500 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అందులో 40 శాతం బన్నీకి ఇవ్వనున్నారట మేకర్స్. మరి ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియాలి.
Comedy Movie In OTT : న్యాయం కోసం పోరాడే యువకుడి స్టోరీ.. ఓటీటీలోకి తమిళ హిట్ మూవీ..
ఇక బన్నీ మాత్రమే కాదు శ్రీవల్లి కూడా ఈ సినిమాకు భారీగానే అందుకుందని సమాచారం. పుష్పకు రూ.3 కోట్లు తీసుకున్న రష్మిక.. పుష్ప 2 కు రూ. 12 కోట్లు అందుకుందని అంటున్నారు. ఇక పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో రష్మిక అదరగొట్టింది. డ్యాన్స్ లు, అందాల ఆరబోత, నటన అద్భుతంగా చేసింది. ఈ సినిమా తరువాత రష్మికకు మరింత గుర్తింపు దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూడాలి.