E-Paper
Advertisement

Family Drama OTT : పిల్లల కోసం ఆపసోపాలు… దత్తత తీసుకుని పడరాని పాట్లు… ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Family Drama OTT : పిల్లల కోసం ఆపసోపాలు… దత్తత తీసుకుని పడరాని పాట్లు… ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
Advertisement

Family Drama OTT : ఓ మంచి ఫ్యామిలీ డ్రామాని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమాను ట్రై చేయండి. ఇందులో కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇది థియేటర్లలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్ర దర్శకుడు స్వయంగా ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆయన ఫేస్ చేసిన అనుభవాల ఆధారంగానే ఈ సినిమాను చూడ చక్కగా  రూపొందించారు. మరి ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్ ఫ్యామిలీ కామెడీ సినిమా పేరు ‘ఇన్‌స్టంట్ ఫ్యామిలీ’ (Instant Family). ఇందులో మార్క్ వాల్‌బర్గ్, రోజ్ బైర్న్ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రులుగా నటించారు. ఇక ఆ ముగ్గురి పాత్రలను ఇసాబెలా మెర్సిడ్, గుస్తావో క్విరోజ్, జూలియానా గామిజ్ పోషించారు. ఈ చిత్రానికి సీన్ ఆండర్స్ దర్శకత్వం వహించారు. ఆయన రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇది 2018 నవంబర్ 16న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా $121 మిలియన్లు వసూలు చేసింది. ఈ సినిమాను ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పీట్, ఎల్లీ అనే దంపతులకు పెళ్ళైనా పిల్లలు పుట్టక పోవడంతో దిగాలు పడతారు. పిల్లలు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. దీంతో వాళ్ళు దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి వెళ్తారు. అక్కడ లిజ్జీ అనే ఒక టీనేజ్ అమ్మాయిని చూసి ఇష్టపడతారు. అయితే లిజ్జీకి ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా ఉంటారు. కేవలం ఒకరినే కాకుండా ఆ ముగ్గురిని ఒకేసారి తమ ఇంటికి తెచ్చుకుని పెంచడానికి ఈ దంపతులు సిద్ధపడతారు. కానీ ఒక్కసారిగా ముగ్గురు పిల్లలు ఇంట్లోకి రావడంతో పీట్, ఎల్లీలకు చుక్కలు కనిపిస్తాయి.

చిన్నపిల్లల అల్లరి ఒకెత్తయితే, టీనేజ్ లో ఉన్న లిజ్జీని అర్థం చేసుకోవడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వారి జీవితం కాస్తా గందరగోళంగా తయారవుతుంది. ఎన్నో గొడవలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరికి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? ఆ పిల్లలు ఈ దంపతులను తమ సొంత తల్లిదండ్రులుగా ఎలా అంగీకరించారు? అనేదే ఈ సినిమాలోని అసలు కథ.

Advertisement

Read Also : లెక్కల మాస్టారుకి ఫ్యామిలీ డెడ్లైన్… లెక్క తప్పే కొత్తకారు మోజు… మిడిల్ క్లాస్ మెమొరీస్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×