E-Paper
Advertisement

Family Drama OTT : లెక్కల మాస్టారుకి ఫ్యామిలీ డెడ్లైన్… లెక్క తప్పే కొత్తకారు మోజు… మిడిల్ క్లాస్ మెమొరీస్

Family Drama OTT : లెక్కల మాస్టారుకి ఫ్యామిలీ డెడ్లైన్… లెక్క తప్పే కొత్తకారు మోజు… మిడిల్ క్లాస్ మెమొరీస్
Advertisement

Family Drama OTT : మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే గొడవలు, ఆ చిన్న చిన్న సంతోషాలను మాటల్లో చెప్పలేం. ఇలాంటి కంటెంట్ తో వచ్చే సినిమాలను ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రిషి కపూర్ లేటు వయసులో నటించిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ సినిమాలో చాలా నేచురల్‌గా మధ్యతరగతి కుటుంబాల జీవితాలను చూపించారు. దీంతో ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. ఒక మామూలు లెక్కల టీచర్ తన నిజాయితీని వదులుకోకుండా, తన ఫ్యామిలీ కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ఫ్యామిలీతో చూడడానికి ఇదొక బెస్ట్ మూవీ.

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

‘దో దోని చార్’ (Do Dooni Chaar) ఇది హిందీ భాషలో వచ్చిన ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా. హబిబ్ ఫైసల్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో రిషి కపూర్, నీతూ సింగ్, అదితి వాసుదేవ్, అర్చిత్ కృష్ణ వంటి నటులు నటించారు. ఈ చిత్రం 58వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. న్యూ యార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిషి కపూర్‌కి బెస్ట్ ఆక్టర్ అవార్డు వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత రిషి కపూర్, నీతూ సింగ్ జంటగా నటించిన చిత్రం ఇది. 2010 అక్టోబర్ 8న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాను ప్రస్తుతం Netflixలో చూడవచ్చు. ఇది హిందీ సినిమాల్లో మధ్య తరగతి ఫ్యామిలీ లైఫ్‌ను బాగా చూపిన క్లాసిక్ ఫిల్మ్‌లలో ఒకటిగా నిలిచింది.

కథలోకి వెళ్తే

Advertisement

ఢిల్లీలో ఉండే సంతోష్ దుగ్గల్ (రిషి కపూర్) ఒక మిడిల్ క్లాస్ మ్యాథ్స్ టీచర్. ఆయనకి పెళ్ళాం, ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఉన్న తక్కువ జీతంతో ఇల్లు గడపడమే కష్టమవుతుంటుంది. ఆ ఫ్యామిలీ అంతా పాత స్కూటర్ మీద నలుగురు ఎక్కి వెళ్తుంటే పడే ఇబ్బందులు మాటల్లో అయితే చెప్పలేం. ఒక ఫంక్షన్‌లో కారు లేదని ఎదురైన అవమానం వాళ్ళకు కొట్టేసినట్లు అవుతుంది. ఇక పిల్లల ముచ్చట తీర్చడానికి, సొసైటీలో పరువు కోసం ఎలాగైనా ఒక కారు కొనాలని డిసైడ్ అవుతాడు సంతోష్ దుగ్గల్. అయితే కారు కొనడం అంటే మాటలు కాదు కదా. ఆ డబ్బు కోసం సంతోష్ పడే తపన ఫన్నీగా ఉంటుంది. చివరికి కారు కొనాలనే తన ఫ్యామిలీ కలను సంతోష్ నరవేర్చాడా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×