E-Paper
Advertisement

Family Drama movie OTT: ఫ్యామిలీని దూరం చేసే టెక్నాలజీ… ఆకట్టుకుంటున్న మరాఠి మూవీ…ఐయండిబిలో 8.6 రేటింగ్

Family Drama movie OTT: ఫ్యామిలీని దూరం చేసే టెక్నాలజీ… ఆకట్టుకుంటున్న మరాఠి మూవీ…ఐయండిబిలో 8.6 రేటింగ్
Advertisement

Family Drama movie OTT : కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక మంచి ఎమోషనల్ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మరాఠీ మూవీ ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. నేటి కాలంలో టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందా ? లేదా బంధాలను కలుపుతుందా ? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, బిజీ లైఫ్ వల్ల దూరమైన తల్లీకొడుకుల బంధాన్ని టెక్నాలజీ ఎలా కలిపిందనేదే ఈ సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ మరాఠీ డ్రామా సినిమా పేరు ‘ఉత్తర్’ (Uttar). 2025 డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమాకు క్షితిజ్ పట్వర్ధన్ దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకుడిగా మొదటి సినిమా ఇదే. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో రేణుకా షహానే, అభినయ్ బెర్డే, హృతా దుర్గులే, నిర్మితి సావంత్ లీడ్ రోల్స్ లో నటించారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత, ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13 నుండి ZEE5 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు 8.6/10 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమాలోని రేణుకా షహానే నటనను చాలా మంది ప్రశంసించారు కూడా. అలాగే ‘హో ఆయి’ అనే సాంగ్ ఈ సినిమాలో చాలా పాపులర్ అయ్యింది. ఇది తల్లికి కృతజ్ఞతలు తెలిపేలా సాగే హార్ట్ టచింగ్ సాంగ్. ఈ సినిమా ఇప్పుడు ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఉమా అనే సింగిల్ మదర్, పుణెలో రేడియో జాకీగా పనిచేస్తూ అందరినీ పలకరిస్తూ సరదాగా ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం తన కొడుకుతో సరిగ్గా మాట్లాడలేదు. ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఉంటుంది. కొడుకు నినాద్ ఒక తెలివైన ఇంజనీరింగ్ స్టూడెంట్. తనకి అమ్మ అంటే ప్రేమే ఉన్నా, అది ఎలా వ్యక్తం చేయాలో తెలియదు. అతను ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటాడు. నినాద్ తన ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక అసిస్టెంట్‌ని తయారు చేస్తాడు. విచిత్రం ఏంటంటే, ఆ AIని అతని అమ్మ మనసులో ఆలోచనలను అర్థం చేసుకునేలా డిజైన్ చేస్తాడు. టెక్నాలజీ సాయంతో అమ్మ మనసులోని బాధలు, ఆమె గతం కొడుకుకి అర్థమవుతాయి. చివరికి ఆ AI వల్ల వీళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తాయి ? వీళ్ళ బంధం బలపడుతుందా ? మరేమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  జైల్లో ఖైదీకి నరకం… కట్ చేస్తే దిమ్మ తిరిగే రివేంజ్… క్లైమాక్స్ వరకు ట్విస్టులతో టెన్షన్ పెట్టే స్టోరీ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×