E-Paper
Advertisement

Thriller Movie OTT : జైల్లో ఖైదీకి నరకం… కట్ చేస్తే దిమ్మ తిరిగే రివేంజ్… క్లైమాక్స్ వరకు ట్విస్టులతో టెన్షన్ పెట్టే స్టోరీ

Thriller Movie OTT : జైల్లో ఖైదీకి నరకం… కట్ చేస్తే దిమ్మ తిరిగే రివేంజ్… క్లైమాక్స్ వరకు ట్విస్టులతో టెన్షన్ పెట్టే స్టోరీ
Advertisement

Thriller Movie OTT : మొట్టమొదటి సారిగా ఓ ఇరానియన్ థ్రిల్లర్ మూవీ అనేక అవార్డులను దక్కించుకుంది. ఆస్కార్ రేసులో కూడా ఈ సినిమా ఉండటం విశేషం. 1 గంట 45 నిమిషాలు ఈ సినిమా ఒక కార్ మెకానిక్ చుట్టూ తిరుగుతుంది. జైలులో హింసించిన ఒక పోలీస్ పై రివేంజ్ తీర్చుకునే క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ ఇరానియన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్’ (It Was Just an Accident). దీనికి ప్రముఖ దర్శకుడు జాఫర్ పనాహి దర్శకత్వం వహించారు. ఇందులో వాహిద్ మొబస్సేరి, మరియం అఫ్షారీ, ఇబ్రహీం అజీజీ లీడ్ రోల్స్ లో ఉన్నారు. ఈ చిత్రం 2025 మే 20న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన పోటీలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. అక్కడ అది ప్రతిష్టాత్మకమైన పామ్ డి’ఓర్‌ అవార్డును గెలుచుకుని విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతేకాకుండా 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో, ఇది ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లేకు నామినేట్ చేయబడిన మొదటి ఇరానియన్ చిత్రంగా నిలిచింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా కూడా నామినేట్ చేయబడింది. 98వ అకాడమీ అవార్డులలో, ఇది ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేకు నామినేట్ అయింది. ఈ సినిమా 2025 అక్టోబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, హులు ప్లాట్‌ ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ చాలా ఉత్కంఠగా సాగుతుంది. టెహ్రాన్‌లో కార్ మెకానిక్‌గా పనిచేసే వాహిద్‌ దగ్గరకు ఒకరోజు ఒక కస్టమర్ వస్తాడు. అతడిని చూడగానే వాహిద్‌ ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఎందుకంటే కొన్ని ఏళ్ల క్రితం జైలులో తనను చిత్రహింసలు పెట్టిన క్రూరమైన గార్డు ఇక్బాల్‌ లాగే అతను కనిపిస్తాడు. ఇక ఇప్పుడు అవకాశం దొరగ్గానే ఆ కస్టమర్‌ను పట్టుకుని బంధిస్తాడు. గతంలో తనతో పాటు జైలులో బాధలు అనుభవించిన మరికొందరు ఖైదీలను కూడా అక్కడికి పిలుస్తాడు. వాళ్లందరూ కలిసి అతడిని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్లి విచారించడం మొదలుపెడతారు.

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఆ వ్యక్తి తాను సాధారణ పౌరుడినని, తనకు ఆ జైలుతో సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా వాహిద్ నమ్మడు. కానీ మిగిలిన స్నేహితుల్లో కొందరికి అతను నిజంగానే ఆ వ్యక్తా, లేక పొరపాటున ఒకేలా ఉన్న వేరే వ్యక్తిని పట్టుకొచ్చామా అని అనుమానం మొదలవుతుంది. కక్ష తీర్చుకోవాలనే ఆవేశం ఒకవైపు, తప్పు చేస్తున్నామేమో అన్న భయం మరోవైపు వాళ్ళలో కనిపిస్తుంది. చివరికి ఆ వ్యక్తి ఎవరు ? వాహిద్‌ అతన్ని ఏం చేస్తాడు ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇద్దరబ్బాయిలతో అమ్మాయి వ్యవహారం… మతిపోగొట్టే రోడ్ ట్రిప్… ఇది పెద్దలకు మాత్రమే

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×