Family Drama OTT : రీసెంట్ గా వచ్చిన ఒక ఫ్యామిలీ డ్రామా ఆడియన్స్ మనసును గెలుచుకుంది. అంతేకాదు ఆస్కార్ వేడుకల్లో మెరిసింది కూడా. ఇది ఒక చూడచక్కని తండ్రీకూతుళ్ల కథ. ఈ సినిమాలోని మ్యూజిక్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాని ఎక్కువగా నార్వే, ప్యారిస్‌లో షూట్ చేశారు. సినిమా అంతా చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఫామ్ కోల్పోయిన తండ్రి, తన కూతుళ్లతో మళ్లీ కలవడానికి ప్రయత్నించడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఈ నార్వేజియన్ డ్రామా సినిమా పేరు ‘సెంటిమెంటల్ వాల్యూ’ (Sentimental Value). దీనికి ప్రముఖ దర్శకుడు జోచిమ్ ట్రియర్ దర్శకత్వం వహించారు. ఇందులో రెనేట్ రీన్స్‌వే, ఎల్లా ఫానింగ్, స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 కాన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన ‘గ్రాండ్ ప్రిక్స్’ అవార్డును గెలుచుకుంది. అలాగే 98వ ఆస్కార్ అవార్డుల్లో (2026) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఆస్కార్ చరిత్రలో ఈ విభాగంలో అవార్డు గెలుచుకున్న మొదటి నార్వేజియన్ సినిమా ఇదే. ఇది 2025 ఆగస్ట్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ముబి (Mubi) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాను తీసిన జోచిమ్ ట్రియర్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఆయన గతంలో తీసిన ‘ది వర్స్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్’ సినిమాకి ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. హాలీవుడ్ స్టార్ ఎల్లా ఫానింగ్ ఈ సినిమాలో నటించడం వల్ల దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పెరిగింది.
ఒకప్పుడు పెద్ద డైరెక్టర్‌గా వెలిగిపోయి, ఇప్పుడు ఫామ్ అవుట్ అయిపోయిన గుస్టావ్ అనే ఒక ముసలాయన కథ ఇది. ఆయనకి ఇద్దరు కూతుళ్లు ఉంటారు, కానీ వాళ్లతో అస్సలు పడదు. చాదస్తం ఎక్కువై అందరినీ దూరం చేసుకున్న ఈయన, ముసలితనంలో ఒంటరితనం భరించలేక, మళ్లీ ఎలాగైనా తన ఫ్యామిలీని సెట్ చేసుకోవాలని, పోయిన తన పరువును వెనక్కి తెచ్చుకోవాలని ఒక లాస్ట్ ప్లాన్ వేస్తాడు. ఆయన పెద్ద కూతురు నోరా ఒక యాక్ట్రెస్. గుస్టావ్ తన తర్వాతి సినిమాలో నోరానే హీరోయిన్‌గా పెట్టాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. కానీ నోరాకి వాళ్ల నాన్న అంటే అస్సలు నచ్చదు, ఆయనతో కలిసి పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. దీంతో చేసేదేం లేక, గుస్టావ్ ఒక హాలీవుడ్ స్టార్ (ఎల్లా ఫానింగ్) ని తీసుకొచ్చి తన సినిమాలో పెట్టి, తన కూతురికి అసూయ కలిగించి ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని చూస్తాడు. మొత్తానికి సినిమా షూటింగ్ సాగుతుంటే, తండ్రీకూతుళ్ల మధ్య పాత గొడవలు, కోపాలు అన్నీ బయటకొస్తాయి. ఒక పక్క తండ్రిగా తన తప్పులు తెలుసుకుంటూనే, ఇంకో పక్క కూతురిని ఎలాగైనా తన సినిమాతో మెప్పించాలని ఆయన పడే తాపత్రయం ఈ కథలో మెయిన్ పాయింట్.
Read Also : ప్రతి ఉదయం ఒక కొత్త పరిచయం… గతం మరిచే ప్రియురాలి కోసం ప్రియుడి తపన… మళ్లీ మళ్లీ మొదలయ్యే ప్రేమ